కోడిగుడ్డు ఏ వయసు వారు ఏ సమయంలో తింటే ప్రయోజనం..!?
కోడిగుడ్డు పోషకాల ఘని. కోడిగుడ్లను తినడం వల్ల అనేక పోషకాలను పొంది పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. కోడిగుడ్లను పరిమితి మేరకు తింటే ఎలాంటి సమస్యలు ఉండవు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు గుడ్లను రోజులో అసలు ఏ సమయంలో తినాలి.. ఏ సమయంలో తింటే మనకు ఎక్కువ పోషకాలు లభిస్తాయి, ఏ సమయంలో వాటిని తినడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందనే సందేహం చాలా మందిలో కనిపిస్తోంది. పోషకాహార నిపుణులు కోడిగుడ్ల వినియోగం పైన కీలక సూచనలు చేస్తున్నారు.
కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. గుడ్డులో ఉండే జింక్ తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధు లకు చెక్ పెట్టవచ్చు. కోడిగుడ్లలో ఉండే మెగ్నిషియం కండరాలను ప్రశాంతంగా మారుస్తుంది. కండరాల నొప్పులను తగ్గించి కండరాలకు బలం కలిగేలా చేస్తుంది. దీంతో కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కోడిగుడ్లలో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రక్తం వృద్ధి చెందేలా చూస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. అలాగే నీరసం, అలసట తగ్గుతాయి. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. కోడిగుడ్లను తినడం వల్ల ప్రోటీన్లను అధికంగా పొందవచ్చు. దీని వల్ల శరీరానికి శక్తి లభించి చురుగ్గా పనిచేస్తారు. ఉదయం సమయంలో కోడిగుడ్డు తీసుకుంటే రోజంతా కావాల్సిన శక్తి సమకూరుతుంది.

నిపుణుల సూచనల మేరకు
కాగా, ఎక్కువ మంది బ్రేక్ ఫాస్ట్ సమయంలోనే కోడిగుడ్డును తీసుకుంటారు. ఉదయం వ్యాయామం చేసిన అనంతరం గుడ్లను తింటే శరీరానికి శక్తి లభించి యాక్టివ్‌గా ఉంటారు. రోజంతా చురుగ్గా పనిచేయగలుగుతారు. రోజంతా శారీరక శ్రమ చేసేవారు కూడా ఉదయం గుడ్లను తింటే మేలు జరుగుతుంది. ఎక్కువ సేపు పనిచేయగలుగుతారు. కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే ఎక్కువ మేలు జరుగుతుంది. ఇక శక్తి పెద్దగా అవసరం లేదని భావించేవారు గుడ్లను మధ్యాహ్నం ఉడక ట్టి తినవచ్చు. అయితే కోడిగుడ్లను రాత్రి పూట తినకూడదు. తింటే శరీరంలో అనవసరంగా క్యాలరీలు.. కొలెస్ట్రాల్ చేరుతాయి. ఇవి మనకు హాని చేస్తాయి. కనుక కోడిగుడ్లను ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే తినాల్సి ఉంటుంది. బీపీ, షుగరు సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సూచనల మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. వయసుతో పాటుగా ఆరోగ్య సమస్యలు.. మందులు వాడుతున్న వారు మాత్రం నిపుణుల సూచనల మేరకు తీసుకోవటం ఉత్తమం.













Click it and Unblock the Notifications