సూపర్ టేస్టీ ఎగ్ భుర్జీ.. ఇలా చేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవెల్ అంతే..!
రోజుకో గుడ్డు తినాలని వైద్యులు చెబుతుంటారు. గుడ్డులో అనేక పోషకాలు దాగి ఉన్నాయి. అందుకే గుడ్డును ఏదో ఒక రూపంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. చాలామంది గుడ్డు ఫ్రై, ఆమెట్స్, ఉడకపెట్టి ఇలా రకరకాలుగా తింటారు. అయితే సూపర్ టేస్టీ ఎగ్ బుర్జీ ఎప్పుడైనా ట్రై చేశారా..? టేస్టీ అద్దిరిపోతుంది. అయితే సూపర్ టేస్టీ ఎగ్ బుర్జీని ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
ఎగ్ భుర్జి తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. కోడిగుడ్లు 6, ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి నాలుగు సన్నగా తరిగినవి, కరివేపాకు ఒక రెబ్బ, కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగినది, ఉప్పు రుచికి సరిపడా, కారం పొడి ఒక టేబుల్ స్పూన్, పసుపు పొడి అర టేబుల్ స్పూన్, నూనె లేదా నెయ్యి మూడు టేబుల్ స్పూన్ లు తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్ భుర్జి తయారీ విధానం చూస్తే.. ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లను కొట్టాలి. అందులో ఉప్పు, కారం పొడి వేసి బాగా చిలకరించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు వేగేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చిలకరించుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి కరివేపాకు కూడా చేర్చాలి. ఇప్పుడు స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టి, కోడిగుడ్డు బాగా పక్కకి విడిపోకుండా కలుపుతూ మొత్తం మిశ్రమం దగ్గరపడ్డాక పసుపు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఎగ్ భుర్జిను ఒక బౌల్ లోకి సర్వింగ్ చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమంపై నిమ్మకాయ పిండి సర్వింగ్ చేసుకుంటే సరి.. సూపర్ టేస్టీ ఎగ్ భుర్జీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications