స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో సూపర్ టేస్టీ ఎగ్ భుర్జీ.. ఈజీగా ఇలా చేసుకోండి..!
కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు. రోజుకో గుడ్డు తినాలని సూచిస్తుంటారు. గుడ్డులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. గుడ్డును సంపూర్ణ ఆహారంగా చెబుతుంటారు వైద్యులు. అయితే గుడ్డుతో ఏ రకం వంట చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. ఇప్పటికే గుడ్డుతో అనేక రకాల వంటలు చేసుంటారు. ఎగ్ భుర్జీ కూడా ట్రై చేసి ఉంటారు. అయితే ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో సూపర్ టేస్టీ ఎగ్ భుర్జీని ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. మరి ఈ టేస్టీ ఎగ్ భుర్జీని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
సూపర్ టేస్టీ ఎగ్ భుర్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ముందుగా గుడ్లు నాలుగు, ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగినవి, టమాటో రెండు సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి మూడు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్, కారం ఒక టేబుల్ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె రెండు టేబుల్ స్పూన్ లు, కొత్తిమీర తురుము కొద్దిగా తీసుకోవాలి.

ఇక ఎగ్ భుర్జీ తయారీ విధానం చూస్తే.. ముందుగా పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. మంచి వాసన వచ్చేంత వరకూ కలుపుకోవాలి. అందులోనే టమాటాలు, పసుపు, కారం, ఉప్పు, మసాలా వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు గుడ్లను పగలగొట్టి పాన్ లో వేసి బాగా కలపాలి. గుడ్లు పూర్తిగా కుకింగ్ అయ్యేంత వరకూ మిక్సింగ్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి సర్వ్ చేసుకోవడమే.. అంతే సూపర్ టేస్టీ ఎగ్ భుర్జీ రెడీ అయినట్టే..
-
అల్లు అర్జున్ ఫేవరెట్ ఫుడ్ ఇదే.. ఎలా చేయాలంటే ??? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు.












Click it and Unblock the Notifications