బ్రాందీ, విస్కీకన్నా ఈ పాలల్లోనే ఆల్కహాల్ ఎక్కువ
పాలు ఆరోగ్యానికి మంచివనే విషయం తెలిసిందే. ఎందుకంటే వీటిలో అనేక పోషకాలుంటాయి. ఎక్కువ మంది ప్రజలు గేదె పాలు లేదంటే ఆవుపాలు లేదంటే మేక పాలు తాగుతుంటారు. అయితే పాలల్లో ఆల్కహాల్ శాతాన్ని ఎక్కువగా కలిగివుండే జంతువు ఒకటి ఉంది. బీరు లేదా విస్కీ కంటే కూడా ఈ జంతువు పాలల్లో మద్యం మత్తు కలుగుతుంది.
అది ఏ జంతువంటే.. ఏనుగు. దీని పాలల్లో 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఏనుగులు చెరకును బాగా ఇష్టపడతాయి. చాలావరకు చెరుకునే ఆహారంగా తీసుకుంటాయి. ఎక్కువ సందర్భాల్లో ఏనుగులు చెరుకుతోటలపై పడి వాటిని నాశనం చేయానే వార్తలు వస్తుంటాయి. చెరకులో అధిక సంఖ్యలో ఆల్కహాల్ -ఫార్మింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకే ఏనుగు పాలల్లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది.

ఏనుగు పాలు చాలా ప్రమాదకరం. వీటిలో ఉండే కెమికల్స్ మనుషులకు ఎంతో హాని చేస్తాయి. అందుకే ఇవి తాగడానికి పనికిరావు. ఏనుగు పాలల్లో బీటా కేసైన్ ఉంటుంది. దీనికారణంగా పాలల్లో ఎక్కువ సంఖ్యలో లాక్టోస్ ఉంటుంది. ఆఫ్రికన్ ఆడ ఏనుగుల్లో ఎక్కువ స్థాయిలో లాక్టోస్, ఒలిగోశాచురైడ్లు ఉంటాయి. మనుషులు ఈ పాలు రెండు సిప్స్ తాగితే చాలు మూర్ఛ పోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కార్బొహైడ్రేట్స్ అధిక పరిమాణంలో ఉంటాయి. వీటిని తాగిన వెంటనే కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజుకు 12 నుంచి 18 గంటల వరకు ఆకులు, గడ్డి, పండ్లు తింటుంటాయి. వీటికి ప్రతిరోజు 150 కిలోల ఆహారం కావాలని. దీనివల్ల చాలా కెమికల్స్ వీటి శరీరంలో చేరుతుంటాయి.












Click it and Unblock the Notifications