ఖాళీ కడుపున టీ తాగితే ఏమవుతుంది?
టీ.. తేనీరు.. ఉదయం నిద్ర లేవగానే కడుపులో టీ పడకపోతే ఆరోజు తెల్లవారినట్లే అవదు.. ఏ పనిమీద ఆసక్తి కలగదు. తర్వాత టిఫిన్ చేయడానికి ముందు ఒకటి.. టిఫిన్ చేసిన తర్వాత ఒకటి.. మధ్యాహ్నం.. సాయంత్రం.. ఇలా రోజు మొత్తంమీద కనీసం నాలుగైదుసార్లు టీ తాగాల్సిందే. తలనెప్పిగా ఉంటే టీ.. పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే టీ.. నలుగు స్నేహితులు కలిస్తే టీ.. ఇలా మన జీవితంలో టీ అనేది అంతగా భాగమైంది. కొందరు మాత్రం ఉదయం నిద్ర లేవగానే పరగడుపునే టీ తాగుతారు. అలా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కడుపులోని పొర దెబ్బతింటుంది
ఖాళీ కడుపుమీద టీ తీసుకోవడంవల్ల పేగులపై ప్రభావం పడి.. కడుపు నొప్పితోపాటు గ్యాస్ ట్రబుల్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ పనితీరు దెబ్బతింటుంది. కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి ప్రమాదకరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. దంతాలు దెబ్బతిని దంత క్షయానికి దారితీస్తుంది. క్యాన్సర్, పెప్టిక్ అల్సర్ వంటి వ్యాధులు కూడా వస్తాయి. పరగడుపున టీ తాగడంవల్ల యాసిడ్లు కడుపులోని పొరకు చికాకు కలిగిస్తాయి. ఉదయం అల్పాహారం తీసుకోకుండా పాలతో చేసిన కాఫీ, టీ తీసుకోకూడదు.

పావుగంట ముందు మంచినీరు తాగాలి
అయితే పరగడుపునే టీ తాగాలనుకునేవారు టీ తాగడానికి పావుగంట ముందు మంచినీరు తాగాలి. దీనివల్ల ఆరోగ్యానికి కొంత ముప్పు తగ్గుతుంది. ఎక్కువమంది పంచదార ఎక్కువగా కలుపుకొని టీ తాగుతుంటారు. దీనివల్ల శరీరంలో ఆరోగ్యానికి హానిచేసే ద్రవాలు పేరుకుపోతాయి. టీ వల్ల శరీరంలో షుగరు పేరుకుపోవడం మినహా ఏ లాభం ఉండదు. సాధ్యమైనంతవరకు అల్పాహారం తీసుకొని టీ తాగితేనే మంచిది. అలా అని ఎక్కువగా తాగకూడదని, రోజుకు రెండుసార్లు, కావాలి అనుకుంటే మరోసారి తాగొచ్చని, అంతకుమించి వద్దని ఆరోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications