బ్రా వేసుకుంటేనే లోపలికి ఎంట్రీ.. ఎక్కడో తెలుసా..?

మహిళల దుస్తుల్లో బ్రా ఒక ముఖ్యమైన భాగం. ఇది ఎగువ శరీరాన్ని ఆకృతి మెరుగ్గా ఉంచడానికి, రొమ్ములకు మద్దతునివ్వడానికి ధరిస్తారు. బ్రా ధరించడం అనేది వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. అయితే నైజీరియాలోని ఒలాబిసి ఒనాబంజో యూనివర్సిటీ తీసుకున్న ఓ కొత్త నిబంధన ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ యూనివర్సిటీ విద్యార్థినులు కాలేజీకి, ముఖ్యంగా పరీక్షలకు హాజరయ్యేటప్పుడు తప్పనిసరిగా బ్రా ధరించాలని అధికారులు నిబంధన విధించారు.

వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, బ్రా ధరించకుండా వచ్చే విద్యార్థినులను తిరిగి ఇంటికి పంపించేస్తున్నారు. పరీక్షల సమయంలోనూ ఈ నిబంధన కఠినంగా అమలు చేస్తున్నారు, బ్రా లేనిదే ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతించడం లేదు.

Entry into Nigeria is only allowed if you are wearing a bra

యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ముయిజ్ ఒలాటుంజీ ఈ కొత్త రూల్‌ను సమర్థించడం గమనార్హం. యూనివర్సిటీలో గౌరవప్రదమైన వాతావరణాన్ని సృష్టించడంలో భాగంగానే ఈ డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మహిళల హక్కులను, స్వేచ్ఛను హరించడమే అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఒక విధంగా ఇది లైంగిక వేధింపుల చర్యే అని విమర్శిస్తున్నారు. ఈ వివాదాస్పద నిబంధనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+