ఆరోగ్యంగా ఉండటానికి మహాత్మా గాంధీజీ ఏంచేసేవారంటే..

గాంధీ జయంతి రోజు జాతిపితను స్మరించుకోవడమే కాదు.. ఆయన తన జీవితంలో ఎటువంటి అలవాట్లు పాటించారో తెలుసుకొని ఆచరించాల్సిన రోజు. మహాత్మా గాంధీజీ జీవన శైలి చాలా సరళంగా ఉంటుంది. ఆరోగ్యంగా జీవించడానికి ఎన్నో అలవాట్లు పాటించారు. ఇతరులకు అవి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఎటువంటి అలవాట్లు పాటించారో తెలుసుకుందాం.

ప్రతిరోజు వాకింగ్ : గాంధీతాత ప్రతిరోజు మైళ్ల దూరం నడిచేవారు. నడక లాంటి శారీరక శ్రమ మనిషికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి, చురుకుగా ఉండటానికి ప్రతిరోజు నడవడం అలవాటు చేసుకోవాలి.

father of nation mahatma gandhiji health habits

ఉప్పు, పంచదార చాలా తక్కువ : గాంధీజీ ఆహారం సులభమైన పదార్థాలతో నిండివుంటుంది. ఉప్పు, పంచదార, కొవ్వు తక్కువగా ఉండేవి తీసుకుంటారు. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం, రక్తపోటు, గుండె జబ్బుల్లాంటి సమస్యలు వస్తాయి. వాటిని తీసుకోవడం తగ్గిస్తే ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.

ధూమపానం, మద్యపానానికి దూరం : పొగాకు లేకుండా, మద్యపాన రహిత జీవితం కోసం గాంధీజీ ఎంతో కృష్టి చేశారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై ఇవి అధిక ప్రభావాన్ని చూపుతాయని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. పొగాకు, ఆల్కహాల్ ను మానివేయడంవల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

father of nation mahatma gandhiji health habits

పర్యావరణ పరిశుభ్రత : గాంధీజీ పర్యావరణ పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు. ప్రస్తుత వాతావరణం కాలుష్యంతో నిండిపోయి ఉంది. వాతావరణం బాగుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంద్వారా పర్యావరణాన్ని పరిరక్షించినవారిమవుతాం.

వ్యక్తిగత పరిశుభ్రత : గాంధీజీ వ్యక్తిగత శుభ్రతను కచ్చితంగా పాటించేవారు. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం అనేది వ్యక్తిగత పరిశుభ్రత పాటించేవాటిల్లో ప్రధానమైన విషయం. మనకు వచ్చే రోగాల్లో 70 శాతం చేతులు శుభ్రంగా లేకపోవడంవల్లే వస్తాయని వైద్యులు చెబుతుంటారు. మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకోవడమే కాదు.. ఆయన జీవనశైలిని, సరళమైన, ఆరోగ్యకరమైన అలవాట్లను కూడా పాటించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+