పాదాలు పగులుతుంటే ఇలా చేయండి
చాలామందికి పాదాల అడుగు భాగంలో పగుళ్లు వస్తాయి. కొన్నిసార్లు మంట అనిపిస్తాయి. పాదాల పగుళ్లతో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా బాధపడుతుంటారు. కొందరు వాటికి చికిత్స చేయించుకోకుండా అలాగే వదిలేస్తారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో కూడా పాదాల్లో పగుళ్లు రాకుండా నిరోధించవచ్చు. శరీర భారాన్ని మోసేవి పాదాలే. అందువల్ల అవి ఒత్తిడికి గురవుతుంటాయి. పాదాల కింద చర్మం మందంగా ఉండి కండర పొరతో విస్తరించి ఉంటుంది.
శరీరానికి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థలో అడుగున పాదాలే ఉంటాయి. రక్తం ఒక్కోసారి అక్కడకు చేరే విషయం ఆలస్యమవుతుంటుంది. నీటిని, పోషక విలువలను తీసుకువెళ్లేవి రక్తనాళాలే కాబట్టి శరీరంలోని ప్రతి అవయవానికి నీరు, ఆక్సిజన్, పోషకాలు చేరతాయి. పాదాల అడుగు భాగానికి మాత్రం ఇవి అందక అక్కడ ఎండిపోయే అవకాశం ఉంది. ఇలా ఎండిపోయిన తర్వాత చర్మం పగుళ్లు ఏర్పడుతుంది. ఇలా జరగకుండా ఉండటానికి కొన్ని వంటింటి చిట్కాలను పాటించి చూద్దాం.

* పైనాపిల్ పండును మిక్సీలో వేసి గుజ్జులా చేసుకొని దాన్ని పాదాల పగుళ్ళపై రాయాలి. అలా 45 నిమిషాలు వదిలేయాలి. పైనాపిల్ లో ఉండే ఆమ్ల గుణాలు పగుళ్లలో పేరుకుపోయిన నిర్జీవమైన కణాలను తొలగిస్తాయి. తద్వారా పాదాల పగుళ్లు తగ్గుతాయి. అక్కడి చర్మం మృదువుగా మారుతుంది.
* పాదాలకు ప్రతిరోజు మర్దన చేసుకోవాలి. దీనివల్ల రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది. చర్మం పోషకాహారంతో నిండి పగళ్లు రాకుండా అడ్డుకుంటుంది. ప్రతిరోజు పావుగంట నుంచి 20 నిముషాల సమయం ఇలా మర్దన చేసుకోవాలి.
* ప్రతిరోజు నిద్ర పోవడానికి ముందు పాదాల పగుళ్ల భాగంలో కొబ్బరి నూనెను బాగా పట్టించి మర్దనా చేయాలి. ఇలా కనీసం పావుగంట నుంచి 20 నిముషాలసేపు చేయాలి.
* చల్లటి నీరు నింపిన బకెట్ లో ప్రతిరోజు పావుగంట సేపు పాదాలను బకెట్ లో ఉంచాలి. తర్వాత పాదాలు పగిలినచోట బాగా రుద్దాలి. ఇలా చేయడంవల్ల మృత కణాలు పోతాయి.












Click it and Unblock the Notifications