వేసవిలో ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే..
ఆయుర్వేదంలో వేసవి కాలాన్ని గ్రీష్మరుతువుగా పేర్కొంటారు. సూర్యుడు తన తాపంతో మన నుంచి బలాన్ని గ్రహిస్తుండటంవల్ల ఒంట్లో కఫం కరిగిపోయి ద్రవంగా మారుతుంది. జఠరాగ్నిని చల్లబరిచి అగ్ని మాంద్యానికి దారితీస్తుండటంవల్ల ఆకలి తగ్గుతుంది. ఒంట్లో తలెత్తే అన్ని వ్యాధులకు అగ్నిమాంద్యమే మూలం. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
* తిన్న వెంటనే తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
* ఆహారం కాస్త జిడ్డుగా ఉండేటట్లు చూసుకోవాలి. నెయ్యి, నూనెను మితంగా తీసుకోవాలి.
* వేసవిలో బచ్చలికూర, క్యాబేజీ, పొట్లకాయ, బీరకాయ, పొన్నగంటి కూర, బుడిద గుమ్మడికాయ, కాకరకాయ లాంటి కూరలు తినాలి.
* పేలాల పిండిలో పంచదార కలుపుకొని తింటే శరీరానికి చలువ చేస్తుంది.

* మధురంగా ఉండే పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. పనస, అంజీరా, ఖర్చూరం, ద్రాక్ష తదితరవాటిని తీసుకోవాలి
* గోధుమలు, గోధుమ రవ్వతో అన్నం, ఉప్మాలాంటివి తినాలి
* పుల్లటి పెరుగు మంచిాదు. తీయటి పెరుగే తినాలి.
* పాలతో చేసిన పాయసాలు తినాలి.
* గోరువచ్చని పాలలో అటుకలు వేసి కొంతసేపైన తర్వాత తినాలి.
* రాత్రిపూట రెండు స్పూన్ల ధనియాలు గ్లాసు నీటిలో నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. వేడి తగ్గుతుంది.
* చెరుకురసం కన్నా చెరుకు ముక్కలు నమలడం చాలా మంచిది.
* జిలకర పొడి, నీరు, నిమ్మరసం కలుపుకొని తాగడం మేలు చేస్తుంది.
* చిలక్కొట్టి చేసిన మజ్జిగ తేలికగా జీర్ణమవుతుంది.
* రాత్రి పడుకోవడానికి ముందు పాదాలకు, మాడు మీద కొబ్బరినూనె రాసుకుంటే నిద్ర బాగాపడుతుంది.
* వడదెబ్బ నివారణకు గంధం ఉపయోగపడుతుంది.
* ఒక చెంచా గంధం ముద్దను గ్లాసు నీటిలో కలిపి రెండుపూటలా తాగితే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
* తెలుపు, నీలం, ఊదా, ఆకుపచ్చరంగు దుస్తులు ధరించడం మంచిది.












Click it and Unblock the Notifications