health tips: ప్రతీదీ మరచిపోతున్నారా? జ్ఞాపకశక్తిని పెంచే ఈ సూపర్ ఫుడ్స్ తినండి!!
చాలామంది ప్రతి చిన్న విషయాన్ని మరిచిపోతూ ఉంటారు. ఎంత గుర్తు పెట్టుకుందామన్నా గుర్తు ఉండడం లేదని తెగ బాధ పడుతూ ఉంటారు. అలాంటివారు జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను తినడం మంచిది. మరి జ్ఞాపకశక్తిని మెండుగా పెంచే ఆహారపదార్థాలను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజు తినాలి. అలా పోషకాలు మెండుగా ఉండే ఆహారపదార్థాలలో చేపలు ఒకటి. చేపలలో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే, మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరిచే అనేక పోషకాలు ఉన్నాయి. అంతేకాదు రోజు పాలు తాగడం వల్ల కూడా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. పాలలో ఉండే పోషకాలు మన మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. పాలను బ్రెయిన్ బూస్టింగ్ డ్రింక్ గా కూడా చెప్పొచ్చు.

ప్రతిరోజు దానిమ్మ పండును తీసుకోవడం వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇక వాల్ నట్స్ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా, మెదడు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. వాల్ నట్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన మెదడు బాగా పనిచేసేలా చేస్తాయి.
ప్రతిరోజు మనం ఆకుకూరలను తీసుకోవడం వల్ల కూడా షార్ప్ గా పనిచేస్తుంది. పచ్చని ఆకుకూరలు కూరగాయలలో పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మెదడుకు పదును పెట్టడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.ఇక మెదడు సామర్థ్యాన్ని పెంచే వాటిలో కోడిగుడ్లు కూడా ఒకటి. గుడ్డులో విటమిన్ బి, కోలిన్ మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు కోడిగుడ్లను తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అంతేకాదు జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే బాదం పప్పులను, వేరుశనగ పప్పులను ప్రతిరోజు తినాలి. బాదంపప్పులు, వేరుశనగపప్పు లో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మన జ్ఞాపక శక్తిని పెంచి మతిమరుపు నుంచి మనల్ని బయట పడేస్తాయి. ఇటు పెద్దలకే కాదు అటు పిల్లలకు కూడా ఈ ఆహార పదార్థాలను తినిపించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications