బెల్లంతోపాటు ఇవి కలిపి తినండి.. డాక్టర్ అవసరం లేదు
ఎక్కువమంది ఉదయం సమయంలో ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడాన్ని ఇష్టపడతారు. రోజంతా చురుగ్గా ఉండటమే దీనికి కారణం. అనేకరకాల ఆహార పదార్థాలను మార్నింగ్ టైంలో తీసుకుంటుంటారు. వీటికన్నా బెల్లం, శనగలు కలిపి తింటే ఆరోగ్యమంతా మీదే. ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. శనగల్లో ఉండే కాల్షియం, ఫైబర్, బెల్లంలో ఉండే ఐరన్, పొటాషియం వల్ల శరీరం బలోపేతమవుతుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రెండింటినీ కలిపి తీసుకోవడంద్వారా అనేక వ్యాధులను దూరం చేయవచ్చు.. డాక్టర్ అవసరంలేదు. శనగలు, బెల్లం కలిపి తినడంవల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దృఢంగా ఎముకలు : శనగలు, బెల్లం కలిపి తీసుకోవడంవల్ల ఎముకలు బలోపేతమవుతాయి. పప్పులో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడంవల్ల ఎముకలతోపాటు శరీరంలోని ఇతర అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే : గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో శనగలు, బెల్లం శరీరానికి ఎంతో సహకరిస్తాయి. ఈ రెండింటిలో ఉండే పోషకాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పూర్తిగా తగ్గిస్తాయి. ప్రతిరోజు ఉదయం పూట ఈ రెండింటినీ తీసుకోమని పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు.
బరువు తగ్గడానికి : ఊబకాయాన్ని నివారించడానికి, పెరుగుతున్న బరువును తగ్గించడానికి శనగలు, బెల్లం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునే ప్రతిరోజు ఉదయంపూట ఈ రెండింటినీ కలిపి తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
జీర్ణ శక్తి పెరగడానికి : బెల్లం, శనగలు కలిపి తీసుకోవడంవల్ల జీర్ణశక్తి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ రెండూ కలిపి తినడంవల్ల పొట్టకు ఉపశనమం కలుగుతుంది. రెండింటినీ కలిపి తినాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
రక్తహీనత మెరుగుపడుతుంది : శరీరంలో రక్తం సరిగా లేని పరిస్థితుల్లో బెల్లం, శనగలు కలిపి తినాలి. ఈ రెండింటిలో ఉండే ఐరన్ శరీరంలో రక్తహీనత వల్ల ఏర్పడే లోపాలను నివారిస్తుంది.












Click it and Unblock the Notifications