నెయ్యి కలిపిన టీ తాగండి... డాక్టర్ అవసరం రాదు
ఉదయం నిద్ర లేవగానే అందరూ టీ తాగుతుంటారు. టీ గొంతులో పడందే వారికి ఆరోజు గడవదు. కొంతమంది రోజు మొత్తంమీద ఆరుసార్లు తాగేవారు కూడా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది బుల్లెట్ కాఫీ అంటూ తాగేస్తున్నారు. దాని ప్రత్యేకత ఏమిటంటే కాఫీలో నెయ్యి వేసుకొని కలుపుకొని తాగడం. అలాగే ghee టీ అని తాగుతున్నారు. నెయ్యి వేసి కలిపిన టీ తాగుతున్నారు. దీనివల్ల మన ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెయ్యి టీ తాగడంవల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
సాధ్యమైనంత ఎక్కువగా నీరు తాగుతుండాలి
మలబద్ధకంతో ఎంతోమంది బాధపడుతుంటారు. బాత్ రూమ్ కు వెళ్లి గంటల తరబడి కష్టపడుతుంటారు. పేగుల కదలికలు సరిగా లేనప్పుడు మలబద్దకం సమస్య కలుగుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరంగా ఉండటంతోపాటు కడుపులో నొప్పి వస్తుంది. దీన్ని తగ్గించాలంటే నెయ్యి టీ తాగాలి. పీసీవోడీ, సరిగా నిద్ర లేకపోవడం, రక్తపోటు, షుగరులాంటివాటితో బాధపడుతుండేవారికి మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. దీన్ని తగ్గించాలంటే సాధ్యమైనంత ఎక్కువగా మంచినీరు తాగుతుండాలి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంతోపాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

ప్రతిరోజు వ్యాయామం చేయాలి
వాత దోషాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని, జీవనశైలిని సక్రమంగా నిర్వహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం సమస్యల వల్ల తలనొప్పి, అపానవాయువు, తీవ్ర అసౌకర్యంలాంటివి కలుగుతాయి. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ గొప్ప మూలకంగా పనిచేస్తుంది. పేగులు బాగా పనిచేసేలా చూస్తుంది. పేగుల గోడలను మృదువుగా చేసి జీర్ణ లక్షణాలను కలిగివుంటుంది. అలాగే బ్లాక్ టీ కూడా శరీరంలో న్యూరోట్రాన్స్ మిటర్ రేటును పెంచుతుంది. ఇందులో ఉండే కెఫీన్ మనిషికి ఉద్దీపనలా పనిచేయడంతోపాటు చురుకుదనాన్ని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications