మీ ఇంట్లో రెండు పచ్చిమిర్చి ఉంటే డాక్టర్ అవసరంలేదు

పచ్చిమిర్చి అనేది వంటకాలకు ఒక ప్రధాన మసాలా లాంటిది. ఇందులో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థమే దీనికి కారణం. ఈ పదార్థం శరీరంలోని అనేక రకాల క్రియలను ప్రభావితం చేస్తుంది. అధికంగా పచ్చిమిర్చి తినడం వల్ల అజీర్ణం, గ్యాస్, మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చర్మం సున్నితంగా ఉన్న వారికి పచ్చిమిర్చి తాకితే చర్మం ఎరుపుగా మారడం, దురద వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీరు పచ్చిమిర్చి తినే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. పచ్చిమిర్చి వల్ల కలిగే ఉపయోగాలను తెలుసుకుందాం.

జీర్ణ వ్యవస్థకు మేలు
పచ్చిమిర్చి శరీరంలో జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియ సజావుగా పనిచేసేలా చూస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

green chilli health benefits and uses in telugu

బరువు తగ్గడానికి సహాయం
పచ్చిమిర్చిలోని క్యాప్సైసిన్ శరీరంలోని కేలరీలను వేగంగా బర్న్ చేయడంవల్ల సులువుగా బరువు తగ్గుతారు.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
పచ్చిమిర్చిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనివల్ల జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు దరిచేరవు.

గుండె ఆరోగ్యానికి మేలు
పచ్చిమిర్చిలోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాలను శుభ్రపరుస్తాయి. ఇది గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

క్యాన్సర్ నిరోధకం
కొన్ని అధ్యయనాల ప్రకారం పచ్చిమిర్చిలోని క్యాప్సైసిన్ కొన్ని రకాల క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటుందని తేలింది.

నొప్పి తగ్గిస్తుంది
పచ్చిమిర్చిలోని క్యాప్సైసిన్ నొప్పిని తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులు, తలనొప్పి లాంటి సమస్యలను తగ్గిస్తుంది.

చర్మానికి మేలు
పచ్చిమిర్చిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ ఉంచుతాయి. ఇది ముడతలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఏదేమైనప్పటికీ మితంగా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+