గ్రీన్ టీలో వీటిని కలిపి తాగండి.. సూపర్!!
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ప్రతిరోజు వ్యాయామం చేయడంతోపాటు యోగా, ధ్యానం లాంటివి కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తానే బరువు తగ్గడానికి ఎక్కువ మంది గ్రీన్ టీ తీసుకుంటున్నారు. దీన్ని తాగడంవల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. షాపుల్లో, సూపర్ మార్కెట్లలో దొరికే ఈ టీ తాగడంవల్ల ఎన్ని ప్రయోజనాలు దక్కుతాయో తెలుసుకుందాం.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కణాల ఆరోగ్యాన్ని ఇవి కాపాడతాయి. శరీరాన్ని, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే రోజంతా ఉత్సహంగా గడుపుతారు. ఇందులో నిమ్మరసం కలిపి తీసుకోవడంవల్ల సులభంగా బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఆరోగ్యవంతంగా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. మధుమేహంతో బాధపడేవారు ఒక కప్పు గ్రీన్ టీని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

గ్రీన్ టీని ప్రతిరోజు తాగడంవల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది తాగే సమయంలో నిమ్మరసం కలిపి తీసుకోవడంవల్ల మెదడు బాగా పనిచేస్తుంది. అంతేకాదు చురుగ్గా వ్యవహరిస్తుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల మన శరీరంపై దాడిచేసే చిన్న చిన్న రోగాలను సమర్థవంతంగా తిప్పికొట్టొచ్చు. ముత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. రోజుకు ఒకటి లేదంటే రెండుసార్లు మాత్రం గ్రీన్ టీని తీసుకోవాలి. అప్పుడే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది.












Click it and Unblock the Notifications