రెస్టారెంట్ స్టైల్ 'గ్రీన్ మిర్చి చికెన్'.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..!
సండే వచ్చిందంటే నాన్ వెజ్ తినేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. చికెన్ ఎక్కువగా తింటుంటారు. అయితే చికెన్ తో రకరకాల వంటలు చేస్తుంటారు. కాస్త డిఫరెంట్ గా గ్రీన్ మిర్చి చికెన్ తయారు చేశారా..? పచ్చిమిర్చితో చికెన్ తయారీ.. చాలా టేస్టీగా ఉంటుంది. మరి గ్రీన్ మిర్చీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
గ్రీన్ మిర్చి చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు చికెన్ 300 నుంచి 500 గ్రాములు, నూనె తగినంత, ఉల్లిపాయ తరుగు ఒక కప్పు, బిర్యానీ ఆకులు రెండు, జీలకర్ర ఒక చెంచా, ఎండుమిర్చి మూడు లేదా నాలుగు, జీడిపప్పులు పది, పసుపు పావు చెంచా, గరంమసాలా కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి ఒక చెంచా, పెరుగు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ లు, కొత్తిమీర తరుగు కొద్దిగా తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పేస్టు కోసం పచ్చిమిర్చి తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు మూడు లేదా నాలుగు చెంచాలు, జీడిపప్పు పలుకులు రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు కొద్దిగా తీసుకోవాలి.
గ్రీన్ మిర్చి చికెన్ తయారీ విధానం చూస్తే.. ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి పచ్చిమిర్చి పేస్ట్ ను తయారు చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో జీడిపప్పు పలుకులు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలను తుంచి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కొద్దిగా వేసి నీళ్లు పోసుకోవాలి. దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు కర్రీ తయారీకి స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోయాలి. అందులో జీలకర్ర, జీడిపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకులు వేయాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చికెన్ ను అందులో వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టును వేసి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. గరం మసాలా వేసి కలిపి మూతపెట్టి మగ్గించుకోవాలి. కర్రీ దగ్గరకు అవ్వగానే నీళ్లు పోసి కలుపుకోవాలి.

ఆ తర్వాత కొద్దిగా పెరుగు, తగినంత ఉప్పు, నెయ్యి, కొత్తిమీర తరుగు వేసి కుకింగ్ చేసుకోవాలి. చికెన్ ఉడికిన స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి.. సూపర్ టేస్టీ గ్రీన్ మిర్చి చికెన్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications