ఇలా చేయండి... జుట్టు ఒత్తుగా పెరుగుతుంది!

వర్షాకాలంలో మంచినీరు కలుషితమవడంతో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రధానంగా జుట్టు రాలే సమస్య అందరినీ వేదనకు గురిచేస్తుంటుంది.ఆహారపు అలవాట్లు మరినప్పుడల్లా జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇటువంటి సమస్యలకు జామ ఆకులు ఒక్కటే పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.

జామ ఆకులతో చేసిన టీ తాగడంవల్ల శ్వాసకోశ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. ప్రధానంగా దగ్గు తగ్గుతుంది. ఈ ఆకుల్లో ఉండే బి3, బి5, బి6 విటమిన్లు చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి. లీటరు నీటిలో గుప్పెడు జామాకుల్ని 20 నిముషాలసేపు ఉడకబెట్టాలి. గోరు వెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్లకు పట్టించాలి. దీనివల్ల కుదుళ్లు ధృఢంగా అవుతాయి. అంతేకాదు.. జుట్టు నల్లగా మారుతుంది. చుండ్రు రాదు. ఇన్నిరకాల ప్రయోజనాలున్నాయి కాబట్టే జామ ఆకులను తీసుకోవడం అలవాటు చేసుకోవాలంటున్నారు.

hairgrowthinghigh1

జామ ఆకులను నీటిలో ఉడకబెట్టి.. ఆ నీటిని తాగితే కడుపునొప్పి తగ్గిపోతుంది. అతిసారం, డయేరియా కూడా తగ్గుతాయి. జామాకుల్ని నమలడంవల్ల నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. ఈ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. నోటిలో ఉండే పొక్కులు కూడా తగ్గుతాయి. వీటిని నమలడంవల్ల దంతాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. జామ ఆకులతో చేసిన టీని తాగడంవల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర అదుపులో ఉంటుంది. ప్రతిరోజు జామ ఆకులతో చేసిన టీని తీసుకోవడంవల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.

జామ ఆకులు సహజమైన ఔషధంలా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. వీటితో పాటు పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్స్, టానిన్ కెమికల్స్‌ ఉంటాయి. అనేక వ్యాధులను నిరోధించడానికి ఇవి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. చాలా దేశాల్లో సాంప్రదాయ వైద్యవిధానంలో జామ ఆకులను ఔషధంలా ఉపయోగిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+