వీళ్లు జామ పండ్లు తింటే చాలా డేంజర్..!
జామ పండ్లను పేద వాడి యాపిల్ అని వైద్యులు చెబుతారు. దానికి కారణం.. యాపిల్ లో ఉండే పోషకాలలో చాలా వరకు జామ పండులో కూడా ఉంటాయి. మన ఇళ్లలో జామకాయలు అధికంగా లభ్యమవుతాయి. ఇక జామ పండ్లలో విటమిన్ సీ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్, పొటాషియం స్థాయులూ జామ పండ్లలో అధికంగా ఉంటాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి జామ పండు సూపర్ ఛాయిస్ అని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడేవారు తరచూ జామ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండేలా చూసుకోవచ్చని డాక్టర్లు వివరిస్తున్నారు. అంతేకాక జామకాయలో ఉండే కాపర్, ఇతర మినరల్స్ థైరాయిడ్ జీవక్రియలు క్రమబద్ధం చేయడానికి హార్మోన్ల ఉత్పత్తికి ఎంతగానో సహాయపడతాయని చెబుతున్నారు.
అలాగే జామకాయలో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటిచూపును మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి జామ ఎంతో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జామకాయలో ఉండే పీచు పదార్థం షుగర్ పేషంట్స్ కు ఎంతో మేలు చేస్తుంది. మెదడు పనితీరుని మెరుపరుస్తుంది. రక్తపోటుతో బాధపడేవారు జామకాయ తినడం వల్ల దాన్ని అదుపులో ఉండేలా చూసుకోవచ్చు.. అని వైద్యులు వివరిస్తున్నారు.

అయితే జామకాయ నాలుగు రకాల వ్యక్తులకు సమస్యాత్మకంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. జీర్ణ సమస్యలు, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) ఉన్న రోగులు ఈ పండును తీసుకోకూడదని వివరిస్తున్నారు.జామ పండు విత్తనాలు జీర్ణం కావడం కష్టం. ఇది కడుపు నొప్పి, తిమ్మిరి లేదా అజీర్ణానికి కారణమవుతుందని చెబుతున్నారు. అలాగే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారు కూడా ఈ పండుకు దూరంగా ఉండాలట. అంతేకాక జలుబు, దీర్ఘకాలిక సైనస్ సమస్యలు ఉన్న వ్యక్తులు శీతాకాలంలో జామ పండును తినకూడదని వైద్యులు వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications