తాటికల్లు: ఈ దివ్యౌషధాన్ని తాగి చూశారా? గ'మ్మత్తు'గా ఉంటుంది!
తాటికల్లుద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది
తాటి కల్లును 'నీరా' అంటారు. 40 రోజుల పాటు ఉదయాన్నే తాటికల్లును తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది 40 రకాల వ్యాధులకు చికిత్సగా ఉపయోగపడుతుందని పూర్వీకులు చెబుతారు.ఇందులో ఉండే విటమిన్లు, లవణాలు, ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు దీన్ని దివ్యమైన ఔషధంగా భావించి తాగుతారు. ఈ చెట్టు కల్పవృక్షం లాంటిదని మన పూర్వీకులు భావిస్తారు. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినాఈ కల్లుద్వారానే పరిష్కరించుకునేవారు.

తాటికల్లుద్వారా ఎన్నో ప్రయోజనాలు
అనేక అధ్యయనాల్లో తాటికల్లు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని వెల్లడైంది. అయితే ఏదైనా పరిమితికి మించి తీసుకుంటే ప్రమాదకరంగా మారుతుంది. అలాగే తాటికల్లు విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అయితే తాటికల్లును ఏ సమయంలో తీసుకోవాలి? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం. తాటికల్లును చెట్టు నుంచి తీసిన వెంటనే తాగాలి. ఇలా తీసిన కల్లులో ఓ రకమైన సూక్ష్మజీవి ఉంటుంది. అందుకే చెట్టునుంచి తీసిన వెంటనే ఆ సూక్ష్మజీవి మన శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ కారకాలు ఉంటే వాటిని చంపేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

చెట్టు నుంచి తీసిన వెంటనే తాగాలి
చెట్టునుంచి తీసిన వెంటనే తాటికల్లును తాగితే ఎన్నో ప్రయోజనాలుంటాయి. కల్లు తీసిన తర్వాత దాన్ని కదపకుండా కొన్ని గంటల పాటు ఉంచితే అది బాగా పులిసిపోయి ఆల్కహాల్ లా తయారవుతుంది. అలా మారిన కల్లును తాగకూడదు. ఆరోగ్యానికి హానికరం కాబట్టి చెట్టునుంచి తీసిన వెంటనే తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని తీసుకోవడంవల్ల ఎన్నోరకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. డయేరియా, టైఫాయిడ్ వంటివి సోకడానికి కారణమయ్యే వైరస్ లకు ఇది యాంటీ బయోటిక్ గా పనిచేసి వాటితో పోరాడుతుంది.

కడుపును బాగా శుభ్రం చేస్తుంది
ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో జంక్ ఫుడ్, మసాలాల వాడకం బాగా పెరిగింది. తరుచుగా వీటిని తీసుకుంటున్న ప్రజలు స్వయంగా అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. అలాంటివారికి ఈ తాటికల్లు ఎంతో మేలు చేస్తుంది. కడుపును బాగా శుభ్రం చేసే గుణాలు కల్లులో ఉంటాయి. చాలామంది జీవితంలో ఒక్కసారైనా దీన్ని తాగాలని భావిస్తుంటారు. తాటికల్లే కాదు.. తాటిచెట్టు ఆకులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. తాటాకులతో విసనకర్రలు, బుట్టలు, సంచులు, చాపలు, గొడుగులు తయారు చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications