Heart Health: భోజనం తర్వాత సెక్స్ సేఫేనా.. గుండెపోటు, బీపీ ప్రమాదం ఉంటుందా..??

Sex Miths: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు సెక్స్ విషయంలో అనేక అనుమానాలు, అపోహలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే ఇండియాలో సైతం ఈ విషయాన్ని ప్రజలు ఓపెన్ గా మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. సేఫ్ సెక్స్, సెక్స్ హెల్త్ అంశాలపై బహిరంగంగా మాట్లాడుకునే అలవాటు లేకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీంతో చాలా మంది అయోమయానికి గురవుతుంటారు.

అందుకే ఎల్లప్పుడూ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ప్రజల్లో చాలా ముఖ్యమైన అంశం. సహజంగా ప్రజల్లో ఉన్న ఒక అనుమానం భోజనం చేసిన తర్వాత సెక్స్ చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయనే. తిన్న తర్వాత సెక్స్ లో పాల్గొనటం రక్తపోటు, గుండెపోటుకు దారితీస్తుందని చాలా మందికి అతిపెద్ద సందేహాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేటి కాలంలో బిజీ జీవితాన్ని గడుపుతున్న ప్రజలు తమ పనుల నుంచి ఇంటికి లేటుగా రావటం ఆ సమయంలో ఆహారం తీసుకోవటం సర్వ సాధారణంగా మారిపోయింది. కానీ దీని తర్వాత సెక్స్ లో పాల్గొంటే మంచిది కాదనే ఆందోళనలు ఉన్నాయి.

Having sex after a meall leads to heart attack Know doctor samaram s answer to it

అయితే ఈ విషయంపై ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం వివరాలు అందిస్తూ.. భోజనం తర్వాత రతి క్రీడలో పాల్గొనేవారికి గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయన్నారు. కానీ గుండెకు సంబంధించిన అనారోగ్యాలతో బాధతుండేవారు ఇలా భోజనం తర్వాత సెక్స్ చేయటం వల్ల బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటి సమస్యలు ఉండే వ్యక్తులు భోజనం తిన్న తర్వాత కనీసం గంటపాటు సంభోగానికి దూరంగా ఉండటం మంచిదని వెల్లడించారు.

అలాగే సాధారణంగా భోజనం తర్వాత సెక్స్ లో పాల్గొనే వ్యక్తులకు బీపీ 40 పాయింట్ల వరకు పెరుగుతుందని పేర్కొన్నారు. అందువల్ల ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం తక్కువగా తిన్న సమయంలో మాత్రమే సంభోగానికి వెళ్లాలని, కడుపునిండా తిన్నట్లయితే అరగంట నుంచి గంట ఆగటం మంచిదని సూచించారు. అందువల్ల ఫుల్ మీల్స్ తిన్నప్పుడు తగినంత సమయం గడువు తీసుకోకపోతే సెక్స్ సమయంలో పెరిగే బీపీ గుండపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉందని, ఇలా చేయటం వల్ల లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్లు అవుతుందని డాక్టర్ సమరం వెల్లడించారు. దీని ప్రకారం సెక్స్ విషయంలో ఉన్న అపోహలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ దానికి సింపుల్ పరిష్కారం గ్యాప్ తీసుకోవటమేనని డాక్టర్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+