కోడిమాంసం, చేపలు... రెండూ తింటున్నారా? అయితే తెలుసుకోండి
మనలో అత్యధికులు శాఖాహారం కన్నా మాంసామారమే తింటారు. మసాలా దినుసులతో అత్యంత రుచికరంగా ఉండటంతోపాటు ప్రొటీన్లు అందడం కూడా దీనికి కారణం. ఒకప్పుడు వారానికోసారి, రెండు వారాలకోసారి మాంసాహారం తినేవారు. మార్కెట్ లో రెస్టారెంట్లు వెలవడం, వాటిమధ్య పోటీ పడుతుండటంతో రూ.50కి, రూ.100కే నాన్ వెజ్ బిర్యానీని అందిస్తుండటంతో ప్రజలు కూడా మాంసాహారం తినడానికి బాగా అలవాటుపడ్డారు. ప్రతిరోజు ముక్క నోట్లోకి పోకపోతే చికాకుగా ఫీలయ్యేవారు ఎందరో. ప్రతి ఇంట్లో ఆదివారం వచ్చిందంటే చాలు.. చికెన్, మటన్.. లేదంటే చేపలు వండుతుంటారు.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
చికెన్ తోపాటు చాలామంది చేపలను ఇష్టంగా తింటారు. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం. చికెన్ లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. శరీర పెరుగుదల కూడా బాగుండటంతోపాటు ఎంతో ఎనర్జీ వస్తుంది. అయినా ఎక్కువగా తినకూడదు. నాటుకోడితో చేసిన చికెన్ తినొచ్చుకానీ ఎక్కువగా బ్రాయిలర్ చికెన్ తింటే ఆరోగ్యం పాడవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు మాత్రం మటన్ కన్నా చికెన్ తినడం ఉత్తమం. మధుమేహాన్ని నియంత్రించడంతోపాటు గుండె జబ్బుల ప్రమాదం రాకుండా చికెన్ చూస్తుంది. ఐరన్, సెలీనియం, జింక్, విటమిన్ బి3 ఉంటాయి.

మీకు కావల్సిన పోషకాలను ఎంచుకొని
సముద్రపు ఆహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది చేపల్లో ఉండే ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వారానికి రెండుసార్లు చేపలను తీసుకుంటే శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉండటంతోపాటు కండరాలు బలంగా ఉంటాయి. కంటిచూపు మెరుగయ్యే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. ఎముకల అరుగుదల తగ్గడంతోపాటు రాత్రివేళ నిద్ర మంచిగా పడుతుంది. వాస్తవానికి కోడిమాంసం, చేపలు.. రెండూ మంచివే. కోడిమాంసంలో జింక్, ఐరన్ తోపాటు సెలీనియం అధికంగా ఉంటాయి. చేపల్లో ఫాస్పరస్, ఒమెగా3, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. కోడి మాంసం, చేపలు.. రెండూ మంచి ప్రొటీన్లను అందిస్తాయి. మీకు ఏరకమైన పోషకాలు కావాలో తెలుసుకొని అందుకు తగ్గట్లుగా వీటిని తీసుకోవడం ఉత్తమం. అయితే అధికంగా మాత్రం ఏదీ తినకూడదు. మితంగానే తీసుకోవాలి. అప్పుడే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
-
జీరా వాటర్ Vs మెంతుల నీరు- షుగర్ కంట్రోల్ చేయడానికి ఏది బెస్ట్..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications