ఎండలో కొంతసేపైనా నిలబడటంలేదా?

శీతాకాలంలో చలినుంచి కాపాడుకోవడానికి చాలామంది బయటకు కూడా వెళ్లరు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా స్వెట్టర్లు, మంకీక్యాప్ పెట్టుకొని వెళతారు. ఎండ మాత్రం శరీరంపై పడనివ్వరు. సూర్యరశ్మిని దాదాపుగా నివారించే పరిస్థితికి చేరుకుంటున్నారు. కానీ సూర్యరశ్మి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు కొంచెంసేపు ఎండలో గడపడంవల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

విటమిన్ డి : శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ డి అవసరపడుతుంది. ఇది లోపిస్తే ఎముకలు బలహీనంగా మారతాయి. సూర్యరశ్మి నుంచి మన శరీరానికి విటమిన్ డి అధికంగా లభిస్తుంది.

health benefits of sunlight

మెరుగైన మానసిక ఆరోగ్యం : ఉదయాన్నే సూర్యకాంతిలో కాసేపు ఉండడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. సీజన్ ఎఫెక్టివ్ డిజార్డర్ కు గురవరు. ఇది శరీరంలో హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్‌ను విడుదల చేస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది : సూర్యకాంతి శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీన్ని తగ్గించడంలో సూర్యరశ్మి ఎంతో ప్రయోజనకారి.

తాజా ప్రారంభం : ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా మనం ఫ్రెష్ గా ఉండలేకపోతున్నాం. ఉదయాన్నే సూర్యకాంతిలో గడపడం వల్ల ఈ సమస్య దూరమవుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి రోజంతా చురుగ్గా ఉండేలా చూస్తుంది.

నిద్ర చక్రం మెరుగు : ఉదయాన్నే సూర్యరశ్మికి గురికావడం వల్ల మీ కార్డియాక్ రిథమ్( నిద్ర-మేల్కొనే చక్రం) మెరుగుపడుతుంది. రాత్రి వేళ బాగా నిద్రపోతారు. తర్వాతరోజు ఉదయం తాజా అనుభూతిని పొందుతారు. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+