వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: చాలా రోగాలకు, ఊబకాయానికి ఈ రెండు దురలవాట్లే ప్రధాన కారణం: మార్చుకోండి!!

|
Google Oneindia TeluguNews

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యం ఉంటే ఇప్పుడు జీవితంలో అన్నీ ఉన్నట్టే. చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావిస్తూనే, అనారోగ్యానికి కారణమయ్యే జీవనశైలిని అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ పెట్టాలని భావించేవారు ముందుగా అసలు మనిషికి అనారోగ్యాన్ని కలిగించే అలవాట్లు ఏమిటి? వాటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అనారోగ్యాన్ని కలిగించే రెండు చెడ్డ అలవాట్లు

అనారోగ్యాన్ని కలిగించే రెండు చెడ్డ అలవాట్లు

సహజంగా అనారోగ్యాన్ని కలిగించడానికి కారణమయ్యే రెండు ముఖ్యమైన అంశాలు సమయానికి భోజనం చేయకపోవడం, ఆలస్యంగా నిద్రపోవడం. చాలామంది సమయానికి భోజనం చేయరు. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేస్తూ ఉంటారు. ఇక భోజనంలో కూడా సరైన పౌష్టికాహారాన్ని తీసుకోకుండా ఏది పడితే అది తింటూ ఉంటారు. ఆకలి వేసినా పట్టించుకోకుండా కాఫీలు, టీలకు అలవాటుపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనిషి ఆరోగ్యాన్ని పాడుచేసే ప్రధానమైన, భయంకరమైన అలవాట్లలో సమయానికి భోజనం చేయకపోవడం ఒకటి.

 భోజనం ఇలా చేస్తేనే ఆరోగ్యం .. లేదంటే అనారోగ్యం

భోజనం ఇలా చేస్తేనే ఆరోగ్యం .. లేదంటే అనారోగ్యం

అందుకే ప్రతి ఒక్కరూ ఎన్ని కాపాడుకోవాలంటే ముందుగా నిర్ణీత సమయంలో మితంగా భోజనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఆ భోజనంలో కూడా మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజూ ఖచ్చితంగా సమయం ప్రకారం ఆహారం తీసుకునే వారు, తీసుకునే ఆహారంలోని పోషకాలు పై శ్రద్ధ పెట్టేవారు కొంతమేర ఆరోగ్యంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఆరోగ్యం పాడు చేసె మరో దురలవాటు ఇదే

ఆరోగ్యం పాడు చేసె మరో దురలవాటు ఇదే

ఇక మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసే రెండవ కారణం నిద్ర. ప్రతిరోజు మనిషి కచ్చితంగా 8 గంటలపాటు నిద్రపోవాలి. అలా కాకుండా కొంతమంది అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండి సరిగ్గా నిద్రపోరు. సెల్ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోయి నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఇక అర్ధరాత్రి పడుకొని తెల్లవారుజామున నిద్ర లేవకుండా, బారెడు పొద్దెక్కిన తర్వాత లేస్తారు. ప్రతి రోజు ఎనిమిది గంటలపాటు కచ్చితంగా సరైన సమయంలో నిద్రపో వలసిన అవసరం ఉంది. ఇక తెల్లవారుజామునే సూర్యోదయం కాకముందే నిద్ర లేచి వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోయేవారు, 8 గంటల పాటు నిద్రపోని వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ రెండు సరిగ్గా లేకుంటే ఊబకాయం బారిన పడే ప్రమాదం

ఈ రెండు సరిగ్గా లేకుంటే ఊబకాయం బారిన పడే ప్రమాదం

ఇక సరైన సమయానికి ఆహారం తీసుకోకపోయినా, సరైన సమయానికి నిద్రపోకపోయినా దాని ప్రభావం మనిషి శరీరంపై కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. అటువంటివారు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ముందు ఈ అలవాట్లను మార్చుకోవాలని ఖచ్చితంగా సమయానుకూలంగా ఆహారం, నిద్ర అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్యం పాడై పోయిన తర్వాత తంటాలు పడే బదులు, ముందే ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
It is said that not eating on time and not sleeping on time are the causes of illness and obesity. It is said that it is better to change these two bad habits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X