ఇలా చేయండి... వారంలో తెల్లజుట్టు నల్లగా మారుతుంది!

స్త్రీ అయినా, పురుషుడైనా.. ఇద్దరికీ వారి వారి శరీరాల్లో బాగా ఇష్టమైంది జుట్టు. జుట్టుకిచ్చే ప్రాధాన్యత దేనికీ ఇవ్వరు. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే అది వారికి తలపై కిరీటంలాంటిది కాబట్టి. అటువంటి కిరీటం ఊడిపోతోందన్నా, రాలిపోతోందన్నా, నల్లగా నిగనిగలాడే జుట్టు తెల్లబడిపోతోందన్నా ఎంతో బాధేస్తుంది. అందం తగ్గిపోతుందని బాధపడిపోతుంటారు. జుట్టు నల్లగా ఉండేందుకు రసాయనాలు కలిసిన రంగును వాడుతూ అనారోగ్యాలకు గురవుతుంటారు. అలా కాకుండా మన ఇంట్లోనే ఉండే ఒక వస్తువు వల్ల ఎటువంటి అనారోగ్యానికి గురవకుండా జుట్టును వెంటనే నల్లబరుచుకునే మార్గం ఉంది. దాని వివరాలు తెలుసుకుందాం.

ప్రతి ఇంట్లో కచ్చితంగా పసుపు ఉంటుంది. పసుపు లేని ఇల్లు ఉండదు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. జుట్టును ఒత్తుగా మార్చడానికి, తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పసుపుకు కొన్ని పదార్థాలను కలిపి ఉపయోగించడంవల్ల వెంటనే జుట్టు నల్లబడుతుంది. పసుపును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

health Tips to turn white hair black

మూడు టేబుల్ స్పూన్ల పసుపు, ఒక కప్పు పెరుగు తీసుకొని వాటిని కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. జుట్టు మూలాలకు దీన్ని పట్టించి అరగంట ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో లేదంటే కుంకుడుకాయలతో, శీకాకాయ షాంపూతో స్నానం చేయవచ్చు. ఇలా చేస్తుండటంవల్ల జుట్టు రంగు క్రమంగా మారుతూ నల్లబడుతుంది. అంతేకాదు ఒత్తుగా పెరుగుతుంది.

నాలుగు నుంచి ఐదు స్పూన్ల పసుపును, జుట్టుకు సరిపోయేంత కొబ్బరినూనెను తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. కొబ్బరినూనె సహజమైంది, గానుగ దగ్గరది తెచ్చుకుంటే మంచిది. ఈ పేస్ట్ ను జుట్టు మూలాలకు పట్టించి నెమ్మదిగా మసాజ్ చేయాలి. గంట సమయం తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల మీ జుట్టు క్రమంగా నల్లబడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+