Periods:మహిళల పీరియడ్స్ సమయంలో ఆ నొప్పికి వంటింటి చిట్కానే బెస్ట్ మెడిసిన్..!
అసలే వేసవికాలం. బయట అడుగుపెట్టాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండ వేడిమికి పలు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. ఇక మహిళలు బయలాజికల్ సమస్యలతో ఈ వేసవికాలంలో మరింత ఎక్కువగా బాధపడుతుంటారు. సాధారణంగా పీరియడ్స్ సమయంలో మహిళలు మరింత చికాకుగా కనిపిస్తారు. ఓవైపు మండే ఎండలు మరో వైపు పీరియడ్స్ సమస్యతో వారు ఉక్కిరిబిక్కిరై పోతుంటారు. నెలసరి సమయంలో తలెత్తే పొత్తు కడుపు నొప్పి సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. అలాంటి సమస్య తలెత్తినప్పుడు వంటింటి చిట్కాతో ఉపశమనం పొందొచ్చు.
నెలసరి సమయంలో మహిళలు పలు శారీరక సమస్యలకు గురవుతుంటారు. అందులో ప్రధానంగా పొట్ట నొప్పి, వీపు నొప్పి, తలనొప్పి, కాళ్ల నొప్పులు వంటివి ఉంటాయి. ఇక శక్తి స్థాయిలు తగ్గడం, అలసట నీరసం వంటివి కూడా వస్తాయి. కొంతమంది మహిళలైతే పీరియడ్స్ సమయంలో వాంతులు చేసుకుంటారు. ఈ సమయంలో మైగ్రేన్ సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది.పీరియడ్స్ సమయంలో మానసిక సమస్యలకు కూడా మహిళలు గురవుతుంటారు. ఇందులో ప్రధానంగా హార్మోన్ల కారణంగా మానసిక స్థితి మారుతుంది, ఆందోళన ఒత్తిడి పెరుగుతుంది. ఇక మరికొందరు నిరాశలో మునిగిపోతారు. రక్తస్రావం గురించి భయపడుతారు. నెలసరి సమయంలో హాజరవ్వాల్సిన కొన్ని ముఖ్య కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటారు.

ఇక ఇతర సమస్యల గురించి చెప్పాలంటే నిద్రలేమి, అధిక రక్తస్రావం, అసాధారణ రక్తస్రావం అంటే చాలా తక్కువగా లేదా చాలా ఎక్కువగా రక్తస్రావం కావడం వంటివి ఎదుర్కొంటారు.గర్భాశయ కణజాలం శరీరంలోని ఇతర ప్రాంతాల్లో పెరగడం వల్ల కడుపు నొప్పి ఎక్కువగా ఉండటం అధిక రక్తస్రావంకు దారి తీస్తుంది. అయితే వంటింటి చిట్కాతో కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
ఒక గ్లాసు వేడి నీటిలో ఒక స్పూన్ అల్లం మరియు అర స్పూన్ పసుపు వేయాలి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత అర స్పూన్ నిమ్మరసం, తేనే వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయిన ఈ ద్రవాన్ని త్రాగాలి.ఇలా చేస్తే ఎలాంటి కడుపునొప్పి ఉండదు సరికదా రక్తస్రావం కూడా కంట్రోల్ అవుతుంది. ఈ వంటింటి చిట్కా గురించి మీ మహిళా స్నేహితులకు కూడా తెలియజేయడం వల్ల ఉపయోగం ఉంటుంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications