మద్యం తాగేటప్పుడు ఇవి తినండి.. రుచి అదిరిపోతుంది
ప్రస్తుతం ఆల్కహాల్ తాగడం అనేది ఫ్యాషన్ లా మారింది. అందరూ వారాంతపు సెలవుల కోసం ఎదురుచూసేది మద్యం తాగడానికే. మద్యం తాగితే శరీరంపై ప్రతికూల ప్రభావాలుంటాయి. అయితే మద్యాన్ని నెమ్మదిగా, నీరు కలుపుకొని తాగాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను తింటుంటే శరీరంపై ఆల్కహాల్ ప్రభావం తగ్గుతుంది. దీనివల్ల మద్యం రక్తంలోకి నెమ్మదిగా మాత్రమే చేరుతుంది. మత్తు, హ్యాంగోవర్ ను ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అడ్డుకుంటాయి. మద్యంతోపాటు లేదంటే మద్యం తాగిన వెంటనే తీసుకోవాల్సిన ఆహారాలను తెలుసుకుందాం.
(పండ్లు, కూరగాయలు) ఆల్కహాల్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గిస్తాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నారింజకాయ వంటి పండ్లను తినొచ్చు. పాలకూర, కాలే లాంటి ఆకుకూరలతో చేసినవాటిని తినాలి. (డ్రై ఫ్రూట్స్) డ్రై ఫ్రూట్స్, ఆల్కహాల్ మంచి జంటగా పేరుతెచ్చుకున్నాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ వాటిల్లో పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు ఇవి కండరాల తిమ్మిరిని నివారించి నిద్రను మెరుగుపరుస్తాయి.

(గుడ్డు) గుడ్లలో ప్రొటీన్ లభిస్తుంది. ఇందులో సిస్టీన్ అమైనో ఆమ్లాలుంటాయి. కాలేయం మంచిగా పనిచేస్తుంది. హ్యాంగోవర్ల తీవ్రతను తగ్గిస్తుంది. (అవకాడో) ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని ఆల్కహాల్ తో తినడం చాలా మంచిది. ఆరోగ్యవంతమైన కొవ్వులు మెదడు ఆరోగ్యానికి మంచివి. మద్యపానంతో సంబంధం ఉన్న హానిని తగ్గిస్తాయి. (లీన్ ప్రోటీన్లు ఉండే ఆహారం) చికెన్, చేపలు, బీన్స్, చిక్కుళ్లు వంటివాటిలో ఈ ప్రొటీన్లు ఉంటాయి. వీటిని తీసుకుంటే మద్యంలో శోషణ శరీరంలో మందగిస్తుంది. రక్తంలో ఆల్కహాల్ గాఢతను నిరోధిస్తుంది. మత్తు రాకుండా అడ్డుకుంటుంది.












Click it and Unblock the Notifications