దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలనే విషయంలో మాత్రం మనం పెద్దగా పట్టించుకోం. అకస్మాత్తుగా పంటి నొప్పి వచ్చినప్పుడు అర్థమవుతుంది.. దంతాలను ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో అని. ఉదయం నిద్ర లేచిన తర్వాత పళ్లు తోముకోవడంతోనే చాలామంది సరిపుచ్చుతుంటారు. వాస్తవానికి రాత్రి నిద్రకు ఉపక్రమించేముందూ పళ్లు తోముకోవడం తప్పనిసరి. అంతేకాదు.. ఆహారపు అలవాట్ల పరంగా ఎంతో జాగ్రత్తగా ఉండాలి

* అంటుకుపోయే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పళ్లకు అంటుకుపోయే పదార్థాలు ఒక పట్టాన పోకుండా హానికర బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి. చాక్లెట్లు, బిస్కెట్ల వంటివి తిన్నప్పుడు అవి అంటుకుపోతాయి. అవి తిన్నప్పుడు పళ్లను పూర్తిగా శుభ్రం చేసుకోవాలనే విషయాన్ని మాత్రం మరవద్దు.

* పుక్కిలించటం చేయాలి. అన్నం తిన్న ప్రతిసారీ నీటితో నోటిని బాగా పుక్కిలించాలి. దీనివల్ల పళ్ల మధ్యలో చిక్కుకున్న పదార్థాలు తొలగిపోవడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుతుంది.

teeeth

* పుల్లటి పదార్థాలు మితంగా తీసుకోవాలి. నిమ్మ, ద్రాక్ష, పైనాపిల్‌, దానిమ్మ వంటి పుల్లటి పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిలోని ఆమ్లంతో పళ్ల మీది ఎనామిల్‌ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తినే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పుల్లటి పదార్థాలను తిన్నప్పుడు నీటితో పుక్కిలించడంవల్ల ఆమ్లం గాఢత తగ్గుతుంది. వెంటనే పళ్లు తోముకోకుండా అరగంట తర్వాత తోముకోవాలి. అప్పుడు ఎనామిల్‌ కుదుటపడుతుంది.

* నీరు ఎక్కువగా తాగుతుండాలి. మనకు నీరే అమృతం. తగినంత నీరు తాగితే ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుంది. నోరు తడారకుండా చూస్తూ పళ్లకూ మేలు చేస్తుంది.

* చూయింగ్‌ గమ్‌ను నమిలితే ముఖ కండరాలకు వ్యాయామం కలుగుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. అంతేకాదు ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే గమ్‌లోని చక్కెర పళ్లను దెబ్బతీస్తుంది కాబట్టి చక్కెరలేని గమ్‌ను నమలటం ఉత్తమం. దీనివల్ల నోట్లో లాలాజలం బాగా ఊరి పళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతుంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+