షుగరు​ తో బాధపడుతున్నారా, రోజూ ఈ చిట్కాలతో అదుపులో..!!

మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యతో బాధ పడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఒక్కసారి మధుమేహం నిర్ధారణ అయ్యిందంటే నియంత్రణలో పెట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మందులతో పాటు, కొన్ని సహజమైన పద్ధతులు కూడా బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. మందులు వాడుతూనే.. చక్కెర పదార్థాల​కు దూరంగా ఉంటూ సహజ మైన పద్దతులతో నియంత్రణ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

మధుమేహం ఉన్న వారు శారీరక శ్రమను పెంచుకోవడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. కండరాలు గ్లూకోజ్​ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయని, దీనివల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందు కోసం ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారం షుగర్ లెవెల్స్​ ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఈ క్రమంలో కరిగే ఫైబర్ కడుపులో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది, జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒకేసారి ఎక్కువ ఆహారం తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు వేగంగా పెరగవచ్చని, కాబట్టి, ఆహారం పరిమాణాన్ని నియంత్రించడం చాలా ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు.

here-are-easy-ways-to-lower-blood-sugar-levels-naturally

ఆహారాన్ని తక్కువగా ఎక్కువ సార్లు తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి, రక్తంలో గ్లూకోజ్ స్థాయి స్థిరంగా ఉంటాయని తెలిపారు. ఇక, ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం, యోగా, వాకింగ్ వంటి పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రోజు వారీ బ్లడ్ షుగర్ ​ను తనిఖీ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. లెవల్స్ కు అనుగుణంగా ఆహార ప్రణాళికను, వ్యాయామాలను చేయాలని తెలిపారు. అదే విధంగా క్రోమియం, మెగ్నీషియం నోటి ద్వారా తీసుకునే సప్లిమెంటేషన్లు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుందని ఒక అధ్యయనం లో తేలింది. మెగ్నీషియం కార్బోహైడ్రేట్ జీర్ణక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఈ పోషకాలు ఉన్న ఆహారాలు బ్లడ్ షుగర్ నియంత్రణకు దోహదపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+