పాలు కల్తీవా? మంచివా? అని ఇంట్లోనే ఇలా కనిపెట్టండి

పాలు ఎంతో పోషకాహారం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పాలు అవసరం. పాలు లేనిదే రోజు గడవదు. ప్రపంచంలో ప్రస్తుతం పాలకు ఉన్న డిమాండ్ మరే ఇతరవాటికి లేదంటే అతిశయోక్తికాదు. అంతగా ప్రజలకు పాలు అవసరం. అయితే మార్కెట్ లో పాలకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కొంతమంది మోసగాళ్లు కల్తీపాలను మార్కెట్ లోకి ప్రవేశపెడుతున్నారు. అందులోను మనకు దొరికే పాలల్లో ఎన్నో రసాయనాలు కలుస్తాయి. వీటివల్ల లాభమా? నష్టమా? అంటే నష్టమే ఎక్కువ అని చెప్పొచ్చు. రసాయనాలు వాడి పాలల్లో నాణ్యత పెంచుతున్నారు. హైదరాబాద్ లో అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.

డిటర్జెంట్ పొడి కలిపితే ఒక గ్లాసులో పాలు, నీరు తీసుకొని రెండింటినీ కలిపి తిప్పాలి. డిటర్జెంట్ కలిస్తే బాగా నురగ వస్తుంది. దీంతో కల్తీ జరిగినట్లు అర్థం. పాలు స్వచ్ఛమైనవే అయితే చాలా తక్కువగా నురగ వస్తుంది.

Here s how to find adulterated milk at home

యూరియా కలిపారా? లేదా? అని తెలుసుకునేందుకు మార్కెట్ లో యూరియా సేస్ట్రిప్స్ దొరుకుతాయి. వాటిల్లో కొంచెం పాలు పోస్తే గీతలు కనిపిస్తే యూరియాతో తయారు చేశారని అర్థం. ఇవి చాలా ప్రమాదం. కల్తీ పాల కోసం 100 లీటర్ల నీటిలో 5 కిలోల యూరియాను కలుపుతారు. ఆ మిశ్రమం తెల్లగా పాలలా మారిపోతుంది.

ఇంట్లో ఫ్లాట్ బండపై రెండు చుక్కల పాలను వేస్తే పాలు పారినవైపు తెల్లగా ఉంటే మంచివని అర్థం. కల్తీవి అయితే తెల్లగా కనిపించవు. పీహెచ్ స్ట్రిప్ తో కూడా పాల కల్తీని కనిపెట్టొచ్చు. ఇది మార్కెట్ లో దొరుకుతుంది. పీహెచ్ నిష్పత్తి 6.4 - 6.6 మధ్యలో ఉంటే మంచివని అర్థం. అయితే అంతకన్నా నిష్పత్తి తక్కువగా కల్తీ జరిగిందని అర్థం. ఇది తెలుసుకోవడానికి స్ట్రిప్ పై చుక్క పాలు వేయండి చాలు.

టెస్ట్ ట్యూబ్‌లో 5 మిల్లీలీటర్ల పాలు తీసుకొని అందులో 2ml అయోడిన్ ద్రావణం కలిపి మిక్స్ చేయాలి. లేత గోధుమ రంగులోకి మారిపోతే స్వచ్ఛమైనవని అర్థం. చాక్లెట్ రంగులోకి మారితే కల్తీవని అర్థం. గంజి లేదంటే పిండి పదార్థం కలిపితే ఆ రంగు నీలంలో ఉంటుంది.

కల్తీ పాలు ఆరోగ్యానికి మంచివి కావు. చిన్న పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. వాంతులు, టైఫాయిడ్, జ్వరం, కడుపునొప్పి, గ్యాస్ సమస్యలతో బాధపడతారు. పెద్దలకు కూడా తీవ్ర ముప్పు పొంచివుంటుంది. కల్తీ పాల విషయంలో ఎంతో అవగాహన ఉండటంతోపాటు అప్రమత్తత కూడా ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+