వేసవిలో చెమటకాయలు ఎక్కువైతే ఇలా చేయండి
ఎండాకాలంలో చెమట పట్టిన తర్వాత చర్మంపై మొటిమల రూపంలో ఉండిపోతాయి. తేమతో కూడిన వాతావరణంలో నివసించేవారు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. కొన్ని రోజుల తర్వాత ప్రిక్లీ హీట్ దానంతటదే అదృశ్యమవుతుంది. కానీ కొన్నిసార్లు చర్మంపై పెరుగుతుంది. దురద, మంట ఉంటుంది. మార్కెట్‌లో దొరికే ప్రీ-హీటెడ్ పౌడర్‌ను వాడటంవల్ల చర్మ రంధ్రాలు మరింతగా మూసుకుపోతాయి. చర్మంపై ఐస్ రుద్దడం లేదంటే చర్మాన్ని వీలైనంత చల్లగా, పొడిగా ఉంచితే చెమట తగ్గుతుంది.
* పచ్చి మామిడి - పచ్చి మామిడికాయనుని గ్యాస్‌పై కాల్చిన తర్వాత గుజ్జును తీసి ఫ్రిజ్‌లో పెట్టాలి. అది చల్లారిన తర్వాత గుజ్జును శరీరానికి పట్టించాలి.
* కీరదోసకాయ - సన్నగా తరిగిన కీరదోసకాయ ముక్కలను ఒక గ్లాసు నీటిలో వేయాలి. ఇందులో నిమ్మరసం కూడా కలపాలి. ఈ ముక్కలను చెమట పట్టినచోట మెత్తగా రుద్దాలి.

* కొబ్బరి నూనె - కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి.. ఆ నూనెతో శరీరమంతా మసాజ్ చేయాలి. వేడి నుంచి, చెమట నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
* వేప ఆకులు - వేప ఆకులను లీటరు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కలుపుకొని తలస్నానం చేయాలి. దీనివల్ల చెమట కాయలు వెంటనే తగ్గిపోతాయి.
* తులసి - తులసి ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేయాలి. దాన్ని చెమట పట్టిన ప్రదేశంలో రాయడంవల్ల ఉపశమనం కలుగుతుంది.
* చెమట పట్టినచోట అలోవీరా జెల్ రాస్తే తెల్లవారేసరికి చెమటకాయలు తగ్గుముఖం పడతాయి.
* రెండు స్పూన్ల బేకింగ్ సోడాను కప్పు నీళ్లల్లో వేసి మిక్స్ చేసి చెమటకాయలు ఉన్న ప్రాంతంలో రుద్దాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనిద్వారా వెంటనే చెమటకాయల బాధ నుంచి రిలీఫ్ వస్తుంది.












Click it and Unblock the Notifications