Health News: క్యాన్సర్ చికిత్స పరిశోధనల్లో గొప్ప బ్రేక్ త్రూ.. కేవలం గంటలోనే కణాల నాశనం
Cancer News: వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణల ఫలితంగా ఇప్పటికే పలు ప్రాణాంతకమైన వ్యాధులను మానవజాతి కట్టడి చేయగలిగింది. అప్పట్లో మశూచి దగ్గర నుంచి ఇటీవల ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేసిన కరోనా వరకు అన్నింటిపైనా పోరాడి విజయం సాధించాం. అయితే క్యాన్సర్, HIV వంటి కొన్ని రోగాలు మాత్రం మానవ మేధస్సుకు, వైద్య రంగానికి సవాళ్లు విసురుతున్నాయి. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాటిని ఓడించడానికి ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మిలియన్ల కొద్దీ ప్రజలు క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారు. అడ్వాన్స్‌డ్ లేదా కోలుకోలేని స్టేజ్‌కు చేరేవరకు సైలెంట్‌గా తనపని తాను చేసుకుంటూ పోతోంది. ఈ ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అవి కొంతమేర సత్ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. హ్యారీ పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఈ రీసెర్చ్‌లలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు ప్రకటించారు.

తేనెటీగల విషం క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా నాశనం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. 2020లో జరిపిన ఓ అధ్యయనం ఫలితాలు NPJ నేచర్ ప్రెసిషన్ ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇందులో విస్తుపోయే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ మరియు HER2 అధికంగా ఉండే రొమ్ము క్యాన్సర్ కణాలను తేనెటీగల విషం ఆత్యంత వేగంగా చంపేస్తుందని తేలింది.
'గత అధ్యయనాలు పలు రకాల రొమ్ము క్యాన్సర్ మరియు సాధారణ కణాలపై తేనెటీగ విషం లేదా మెలిటిన్ ప్రభావాలను పోల్చలేదు. మేము ఆయా రొమ్ము క్యాన్సర్ కణాలపై దీనిని పరీక్షించాము. ఇందులో సానుకూలంగా ఛార్జ్ చేయబడిన పెప్టైడ్ మెలిటిన్ ను కనుగొన్నాము. కృత్రిమంగా దీనిని మెరుగుపరచవచ్చు. సహజ తేనెటీగల విషంలోని క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలను కృత్రిమ మెలిటిన్ ప్రతిబింబిస్తుంది' అని హ్యారీ పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన కెయిరా డఫ్పీ మరియు యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా పేర్కొంది.
పెర్త్, పశ్చిమ ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మరియు UKలోని 312 రకాల తేనెటీగల విషాన్ని రీసెర్చర్స్ పరీక్షించారు. మెలిటిన్ చాలా శక్తివంతమైనదని ఈ పరిశోధనల్లో వారు కనుగొన్నారు. ఇది క్యాన్సర్ కణ త్వచాలను 60 నిమిషాల్లో నాశనం చేస్తుందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దీనికి అదనంగా క్యాన్సర్ కణాల పెరుగుదల మరియు విభజనకు అవసరమైన రసాయన సంకేతాలను కేవలం 20 నిమిషాల్లో తగ్గిస్తుందని తేల్చారు.
మెలిటిన్ అడ్వాన్స్‌డ్ రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి డోసెటాక్సెల్ మరియు కీమోథెరపీ వంటి చిన్న అణువులతో కలిపి ఉపయోగించవచ్చు. ఈ సమ్మేళనం ఎలుకలలో కణితి పెరుగుదలను అణచివేయడంలో ప్రభావవంతంగా పనిచేసింది. తేనెటీగల విషంలో ప్రధాన భాగమే ఈ మెలిటిన్. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంది. అయినప్పటికీ తేనెటీగలు కుట్టడం నొప్పి, వాపు మరియు అలెర్జీకి కారణమవుతుంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications