వైద్యులు గుండెకు ఆపరేషన్ ఎలా చేస్తారో తెలుసా?
ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అన్ని రోగాలు వస్తున్నాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారిపోవడం, ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం, శరీరానికి సరైన వ్యాయామం చేయకపోవడం, చిన్న చిన్న విషయాలకు కూడా ఒత్తిడికి గురవుతుండటం, ఆత్మహత్యలు చేసుకోవడంలాంటివి జరుగుతున్నాయి. ప్రధానంగా గుండెజబ్బు అంటే కొంత వయసు దాటిన తర్వాత వస్తుందనేది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎంత ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటే అంత తొందరగా గుండెజబ్బుకు గురవుతున్నారు. వైద్యులు గుండెకు ఆపరేషన్ చేసి రోగిని ఎలా రక్షిస్తారనే విషయాన్ని తెలుసుకుందాం.
ఓపెన్ హార్ట్ సర్జరీ
గుండె ధమనుల్లో అడ్డుపడటం, గుండె కవాటాల సమస్యలు, గుండె కండరాలకు నష్టం వంటి సమస్యలకు ఈ శస్త్రచికిత్స చేస్తారు. ముందుగా ఛాతీని కొట్టి రొమ్ము ఎముకను విడదీస్తారు. గుండెను నిలిపివేసి, ఒక యంత్రం ద్వారా రక్తాన్ని శరీరంలోకి పంపి సమస్య ఉన్న భాగాన్ని సరిచేస్తారు. తిరిగి రొమ్ము ఎముకను అతికించి, ఛాతీని మూసివేస్తారు.

కార్డియక్ సర్జరీ
ఓపెన్ హార్ట్ సర్జరీకి బదులుగా చిన్న కోతల ద్వారా గుండెకు చేరుకొని చిన్న శస్త్రచికిత్సలు చేయవచ్చు. చిన్న కోతల ద్వారా సన్నని గొట్టాలు, కెమెరాలను గుండెకు చేరుస్తారు. కెమెరా ద్వారా చూస్తూ సమస్యను సరిచేస్తారు. కోతలు చిన్నవి కాబట్టి రక్తస్రావం తక్కువగా ఉండటంతోపాటు రోగి త్వరగా కోలుకుంటారు.
కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (CABG) సర్జరీ
గుండె ధమనుల్లో అడ్డుపడటం వల్ల గుండె కండరాలకు సరిపడా రక్తం అందకపోతే ఈ శస్త్రచికిత్స చేస్తారు. అడ్డుపడిన ధమని చుట్టూ ఒక కొత్త మార్గాన్ని సృష్టిస్తారు.
రోగి శరీరంలోని మరొక భాగం నుండి తీసుకున్న రక్తనాళాన్ని ఉపయోగించి ఈ కొత్త మార్గాన్ని ఏర్పరుస్తారు.
గుండె కవాటం మార్పిడి
గుండె కవాటాలు సరిగా పని చేయకపోతే ఈ శస్త్రచికిత్స చేస్తారు. దెబ్బతిన్న కవాటాన్ని తీసివేసి కొత్త కవాటాన్ని అమర్చుతారు. కొత్త కవాటం కృత్రిమంగా తయారు చేయడంకానీ లేదంటే మరొక వ్యక్తి నుంచికానీ తీసుకుంటారు.
గుండె మార్పిడి
గుండె దెబ్బతిన్నప్పుడు, ఇతర చికిత్సలు పని చేయకపోతే ఈ శస్త్రచికిత్స చేస్తారు. దెబ్బతిన్న గుండెను తీసివేసి దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన గుండెను అమర్చుతారు.












Click it and Unblock the Notifications