జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి

వాతావరణ కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. ఎన్ని మందులు వాడుతున్నప్పటికీ ప్రయోజనం ఉండటంలేదని వాపోతుంటారు. జట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి మార్కెట్ దొరికే రకరకాల నూనెలను, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూలను వాడుతుంటారు. అయినా ఫలితం లేక నిరాశకు గురవుతుంటారు. వీటికి బదులుగా సహజంగా లభించే కలబందను వాడటంవల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఒక గిన్నెలో నూనె తీసుకొని దాన్ని బాగా వేడిచేయాలి. తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును తీసుకొని కలపాలి. ఇలా తయారైన నూనెను రాత్రి పడుకునే ముందు జట్టుకు బాగా పట్టించాలి. నూనె కుదుళ్లలోకి ఇంకేలా మర్ధనా చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి తెల్లవారిన తర్వాత షాంపూతో స్నానం చేయాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే కలబంద గుజ్జును రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసాన్ని వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి.

how to grow thick hair tips

కలబంద గుజ్జును నేరుగా జట్టుకు రాయడంవల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. జట్టును చిక్కులు లేకుండా బాగా దువ్వాలి. తర్వాత కలబంద గుజ్జును నేరుగా జుట్టు కుదుళలపై రాసి మర్దనా చేయాలి. గంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలపడి రాలడం తగ్గుతుంది. ఇలా చేయడంవల్ల జుట్టు అందంగా మెరుస్తుంది. చుండ్రు సమస్యలు కూడా తగ్గిపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+