కల్తీ పసుపును గుర్తించడం ఎలా..?

పసుపు మన భారతీయ వంటకాల్లో అత్యంత ముఖ్యమైన పదార్థం. ఇది ఆహారానికి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. దీనిని ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. అయితే, కొంతమంది వ్యాపారులు తమ స్వాలాభం కోసం పసుపులో కల్తీ చేస్తుంటారు. ఇలాంటి పసుపులో ఎక్కువగా వివిధ రసాయనాలు లేదా మైనరల్ ఆయిల్స్ మిళితం చేయబడి ఉంటాయి. వీటిని పసుపు రంగును కృత్రిమంగా మెరుగు పరచడం కోసం ఉపయోగిస్తారు. ఈ కల్తీ మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు. అందుకే, పసుపు కొనుగోలు చేసే ముందు కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

పసుపులో కల్తీని గుర్తించే పద్ధతులు:
వాటర్ టెస్ట్ (నీటి పరీక్ష): ఒక గ్లాసు నీటిలో పసుపు పొడి చిన్న మోతాదులో వేసి గమనించండి. స్వచ్ఛమైన పసుపు నీటి అడుగు భాగానికి చేరి, నీరు లేత పసుపు రంగులోకి మారుతుంది. కల్తీ పసుపు వేసిన నీరు ముదురు రంగులోకి మారి, పసుపు పొడి నీటిపై తేలుతుంది.కల్తీ పసుపు నీటిలో కరిగిపోదు.

How to identify adulterated turmeric Try this easily at home

పేపర్ టెస్ట్: ఒక సాఫ్ట్ టిష్యూ పేపర్ మీద పసుపు పొడి వేసి, వత్తడం ద్వారా నూనె మరకలు ఏర్పడుతాయా లేదా చూడండి. నూనె మరకలు ఉంటే, అది మైనరల్ ఆయిల్ కల్తీకి సూచన.

హైడ్రోక్లోరిక్ ఆమ్ల పరీక్ష: ఒక టెస్ట్ ట్యూబ్‌లో చిటికెడు పసుపు వేయాలి. దానిలో కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి. ఇది గులాబీ రంగులోకి మారితే ఆ పసుపు కల్తీదని అర్థం. మారకపోతే అది స్వచ్ఛమైన పసుపు.

వినెగర్ పరీక్ష: పసుపులో కొద్దిగా వినెగర్ వేసి కలపండి. అసలు పసుపు రంగు మారదు. కల్తీ పసుపు రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది.

రుచి, వాసన పరీక్ష: స్వచ్ఛమైన పసుపుకు తీపి కారం రుచి ఉంటుంది. కల్తీ పసుపు రుచి కొంచెం కృత్రిమంగా ఉంటుంది. అసలు పసుపుకు ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. కల్తీ పసుపులో ఆ వాసన సరిగా ఉండదు.

స్పర్శ: అసలు పసుపు మృదువుగా, మెత్తగా ఉంటుంది. కల్తీ పసుపు కొద్దిగా గరుకుగా లేదా ముద్దగా ఉంటుంది. అంతేకాకుండా ఒక తెల్లని బట్టపై కొద్దిగా పసుపును రుద్దండి. అసలు పసుపు బట్టను పసుపు రంగులోకి మారుస్తుంది. కల్తీ పసుపు బట్టను మరక చేయదు.

కల్తీ పసుపు వల్ల కలిగే నష్టాలు: కల్తీ పసుసు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది కాలేయ సంబంధిత సమస్యలు పెంచుతుంది. అలర్జీలు, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది.

స్వచ్ఛమైన పసుపు ఎలా కొనాలి?
స్వచ్ఛమైన పసుపును విశ్వసనీయ వ్యాపారుల వద్దే కొనండి. నమ్మకమైన బ్రాండ్స్ లేదా ప్రత్యక్ష రైతుల నుంచి పసుపు కొనుగోలు చేయవచ్చు. మార్కెట్లో ప్యాకేజింగ్, సర్టిఫికేషన్ ఉన్న పసుపు బ్రాండ్స్ పై విశ్వాసం ఉంటే కొనుగొలు చేయవచ్చు. పసుపు వంటింట్లో ముఖ్యమైన భాగం కాబట్టి, దాని స్వచ్ఛతను నిర్ధారించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+