ఇంట్లో తయారుచేసే ఈ క్రీమ్ తో ముడతలు, మచ్చలు మాయం
వయసు పెరిగే కొద్దీ మన చర్మంపై వయసు తాలుకా సమస్యలు కనిపిస్తుంటాయి. ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. శరీరంలో కొల్లాజెన్ అనే పదార్థం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడతాయి. వీటిని దూరం చేయడానికి కొల్లాజెన్ క్రీమ్ బాగా పనిచేస్తుంది. దాన్ని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కుకుంబర్ ఫేస్ ప్యాక్
కావల్సినవి : ఓ కప్పు దోసకాయ ముక్కలు, సగం కప్పు అవిసె గింజలు, విటమిన్ ఇ ఆయిల్ ఓ టేబుల్ స్పూన్. ఈ మూడు కూడా చర్మానికి మేలు చేసేవే. వీటిని వాడడం వల్ల కళ్ళకింద నల్లవలయాలు, గీతలు, పిగ్మంటేషన్, ముడతలు దూరమవుతాయి.

ఫ్లాక్స్ సీడ్ : ఈ గింజల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. అవసరమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలన్నీ ఉండి చర్మానికి తేమ, పోషణ అందిస్తుంటాయి.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మచ్చలను తగ్గించి చర్మాన్ని నునుపుగా మారేలా చేస్తుంది.
విటమిన్ ఇ : బ్యూటీ బెనిఫిట్స్‌కి విటమిన్ ఇ ఆయిల్ పెట్టింది పేరు. దీనిని వాడడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. కంటి చుట్టూ ఉన్న ముడతలను దూరం చేయడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన యూవీ కిరణాల నుంచి కూడా రక్షణ అందిస్తుంది.
తయారుచేసే విధానం : ముందుగా దోసకాయ మెత్తగా చేసి రసం తీయాలి. అవిసె గింజల్ని ఉడికించి జెల్ లా తయారుచేయాలి. ఈ రెండింటిని ఓ పాత్రలో వేసి అందులో విటమిన్ ఇ నూనె కలిపి వాటిని మిక్స్ చేసి ఓ కంటెయినర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి నిద్రించేముందు ఈ క్రీమ్‌ని ముఖంపై అప్లై చేస్తే స్కిన్‌పై ఉన్న మచ్చలు, మొటిమలు దూరమవుతాయి.












Click it and Unblock the Notifications