ఇవి తినండి... ''ఫ్రీగా, ఇబ్బంది లేకుండా వెళుతుంది''!!

తరుచుగా అందరూ ఎదుర్కొనే ప్రధానమైన సమస్య మలబద్దకం. రక్తస్రావం, మలద్వారం కోసుకుపోవడం వల్ల పైల్స్ ఏర్పడతాయి. మలం విసర్జించడంలో ఇబ్బంది ఉన్నా, పేగులు సరిగా కదలకపోయినా మలబద్దకం ఏర్పడుతుంది. నీరు తాగకపోవడం, వేయించిన పదార్థాలు తినడం, జంక్ ఫుడ్, ఫైబర్ లేకపోవడంతోపాటు శారీరక శ్రమ లేకపోవడం, రాత్రివేళ ఆలస్యంగా తినడంవల్ల కూడా వస్తుంది.

మలబద్ధకానికి చికిత్స చేయకపోతే పెద్ద పేగు క్యాన్సర్ కు, ఫైల్స్ కు దారితీస్తుంది. కొన్ని పండ్లు తీసుకుంటుంటే సులువుగా మలబద్ధకాన్ని నివారించుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

how to solve the constipation problem

అరటిపండు: మలబద్ధకాన్ని నివారించడంలో అరటిపండు దివ్యౌషధం లాంటిది. ఇందులో ఫైబర్ ఎక్కువగాద ఉంటుంది. పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. చిన్న పేగుల్లోని మైక్రోవిల్లి సరిగా పనిచేయడానికి తోడ్పడుతుంది.

ఆరెంజ్‌: ఇందులో విటమిన్ సితోపాటు ఫైబర్ కూడా ఉంటుంది. కమలాపండును పూర్తిగా తింటే మలబద్దక సమస్య దూరమవుతుంది.

కివి: విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫైబర్, నీటి శాతం కూడా ఎక్కువే కివిలో ఉండే ఆక్టినిడిన్ ఎంజైమ్ మలబద్దక సమస్యకు చెక్ పెడుతుంది.

పియర్స్‌: ఫైబర్ తోపాటు ఫ్రక్టోజ్‌, సార్బిటాల్ వంటి మూలకాలు ఉంటాయి. ఫైబర్‌ పేగు కదలికలను మెరుగుపరచడంతోపాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పియర్స్‌లోని సార్బిటాల్ మలాన్ని మృదువుగా చేస్తుంది. ​

యాపిల్‌: డయేరియా, మలబద్దకం లాంటివాటికి యాపిల్ ఉపశమనం. పై తొక్క తీయకుండా యాపిల్ ను తినాలి. తొక్కలో కరగకుండా ఉండే ఫైబర్ ఉంటుంది. ఇది పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. అలాగే ఇందులో కరిగే ఫైబర్ కూడా ఉంటుంది.

బొప్పాయి: ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ పనితీరును సరిచేస్తుంది. బొప్పాయిని చియా, అవిసె గింజలతో తీసుకుంటే వెంటనే ఉపశమనం దొరుకుతుంది. అంజీర, డ్రైప్లమ్స్ వంటివి కూడా మలబద్దకాన్ని నయం చేస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+