మీ కళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని అనుకుంటున్నారా?

సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషి శరీరంలో ఉండే అన్ని అవయవాలకన్నా కళ్లు అత్యంత ముఖ్యమైనవి అని అర్థం. కళ్లు ఉంటే కాళ్లు, చేతులు లేకున్నా బతకొచ్చు అంటారు. అంతటి ప్రాధాన్యం కళ్లకు ఉంది. చూపు లేనప్పుడు అంతా చీకటిగానే కనపడుతుంది. అటువంటి కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే విటమిన్ ఏ ఉంటే సరిపోతుందికదా అనుకుంటారు చాలామంది. కానీ కళ్లు ఆరోగ్యంగా ఉండడానికి ఏ ఒక్కటే కాకుండా ఇతర విటమిన్లు కూడా అవసరపడతాయి. అవేంటనేది తెలుసుకుందాం.

విటమిన్‌ ఏ:కంటి చూపు మెరుగ్గా ఉంచడానికి ఇది తోడ్పడుతుంది. విటమిన్ ఏ రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి సహాయపడుతుంది. మొక్కల్లో విటమిన్ ఏ బీటా కెరోటిన్ ఉంటుంది. ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు శరీరంలోని పేగుల్లో బీటా కెరోటిన్ విటమిన్ ఏ గా మారుతుంది. గుడ్లు, క్యారెట్, ఆకుకూరలు, చేపనూనె, వెన్న, టమాటా, పసుపురంగులో ఉండే ఫలాలు, పాలల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. వీటిని కచ్చితంగా రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి.

Elders said Sarvendriyanam.. Nayanam Pradnam.

విటమిన్ సి:కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ సి కూడా ముఖ్యమైందే. కళ్లను యూవీ కిరణాల నుండి ఇది రక్షించడంతోపాటు శరీరంలోని ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. ఈ ఆక్సీకరణ ఒత్తిడివల్లే వయసు పెరుగుతున్నకొద్దీ కంటిచూపు మందగిస్తుంది. కళ్లను రక్షించుకోవాలంటే జామపండు, యాపిల్, ద్రాక్ష, బ్లాక్ బెర్రీ, బ్రోకలీ, కమలా, సిట్రస్ జాతిపళ్లను తీసుకోవాలి.

విటమిన్ ఇ:కళ్ల ప్రొటీన్‌ నిర్మాణాన్ని రక్షించడానికి ఇది తోడ్పడుతుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడంతోపాటు ప్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని అందిస్తుంది. బాదం, పొద్దుతిరుగుడు, సోయాబీన్స్, వేరుశనగల్లో లభిస్తుంది. జింక్ మెలనిన్ యూవీ కిరణాల నుంచి కళ్లను రక్షిస్తుంది. ప్రతిరోజు మనం 40 నుంచి 80 మిల్లీగ్రాములు తీసుకోవాలి. బీన్స్, చిక్ పీస్, తృణధాన్యాలు, నట్స్, గుమ్మడి గింజలు, పాలు తీసుకోవాలి. గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు, మాంసం, నట్స్ ఆహారంలో చేర్చుకుంటే కళ్లు సుక్షితంగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+