Uric Acid: యూరిక్ యాసిడ్ ఎక్కువుందా.. అయితే ఈ పదార్థాలు తీసుకోండి..!
ఈ మధ్య చాలా మందికి యూరిక్ యూసిడ్ సమస్య వస్తుంది. అయితే చాలా దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల రీనల్ కోలక్, ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. యూరిక్ యాసిడ్ తగ్గే మందులు లేదా ఆహారం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. మరి ఏ పదార్థాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ తగ్గుతుందో చూద్దామా..
తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకునే వారిలి యూరిక్ యాసిడ్ అదుపులో ఉంటుంది. మీకు అప్పటికే యూరిక్ యాసిడ్ ఉంటే తృణ ధాన్యలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఏదోరూపంలో ఏవో ఒక తృణ ధాన్యాలు తీసుకోవడం చాలా మంచి అలవాటని నిపుణులు చెబుతున్నారు. ఫ్రూట్ సలాడ్ యూరిక్ యాసిడ్ సమస్య తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. పుచ్చకాయ, దోసకాయ, మామిడి, అరటి, ఆరెంజ్, యాపిల్ వంటి పండ్లు తింటే ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తాయి.

ఫ్రూట్ సలాడ్ లో ఉండే విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. టమాటాకు యూరిక్ యాసిడ్ తగ్గించే శక్తి ఉంది. అందుకో మీ ఆహారంలో టమాటాను భాగంగా చేసుకోవాలి. ఆపిల్‌లో ఉండే మలిక్ యాసిడ్ మొటిలిటీని తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ నియంత్రణలో ఉంచేలా చేస్తుంది. జైతూన్ ఆయిల్ అన్నింటికంటే అద్భుతమైంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించేందుకు దోహదపడుతుంది.
పప్పుల్లో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, విటమిన్ కే, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.పెరుగులో ఉంటే ప్రో బయోటిక్స్ ప్రేవుల్ని శుభ్రపర్చడమే కాకుండా యూరిక్ యాసిడ్‌ను తక్షణం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వారు ఎక్కువగా మాంసం తినకూడదు. లిక్విడ్ ఫుడ్ తీసుకుంటే మంచిది. మసాలా ఫుడ్ ఎక్కువగా తీసుకొవద్దు.












Click it and Unblock the Notifications