Health News: యూరిక్ యాసిడ్ పెరుగుతుందా.. అయితే ఈ పని చేయండి..!
ఈ మధ్య చాలా మంది యూరిక్ యాసిడ్ గురించి మాట్లాడుతున్నారు. అస్సలు యూరిక్ యాసిడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. శరీరంలో ఉత్పత్తి అయ్యే అనేకర రసాయనాల్లో యూరిక్ యాసిడ్ ఒక్కటి. ఇది బాడీలో ప్యూరిన్ల విచ్ఛనం అవడం వల్ల తయారు అవుతుంది. ఇది మూత్రపిండాలు మూత్రాన్ని ఫిల్టర్ చేయడం ద్వారా పని చేస్తాయి. కానీ శరీరంలో ఇది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రపిండాలు దానిని సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. దీనివల్ల యూరిక్ యాసిడ్ స్ఫటికాలు విరిగిపోయి శరీరంలోని కీళ్లలో పేరుకుపోతాయని వైద్యులు చెబుతున్నారు.
హై బీపీ
యూరిక్ యాసిడ్ పెరిగడం వల్ల హై బీపీ, కీళ్ల నొప్పులు, కూర్చోవడంలో ఇబ్బంది, శరీరంలో వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. పచ్చిమిర్చి, సాయ మినప పప్పు తినడం వల్ల శరీరంలో యాసిడ్ పరిమాణం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఎక్కువగ నాన్ వెజ్ తినడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది.

యూరిక్ యాసిడ్ తగ్గించడానికి స్ట్రాబెర్రీ జ్యూస్ ప్రభావవంతంగా ఉపయోగపడుతుందట. ఇందులో ఉండే గుణాలు ప్రభావవంతంగా యూరిక్ యాసిడ్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకునేందుకు నారింజ రసం కీలక పాత్ర వహిస్తుంది. నారింజలో విటమిన్ సి కూడా ఉంటుంది. అరటిపండులో పొటాషియం విలువలు అధిక పరిమాణంలో ఉంటుంది.

అరటి పండు జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో పెరుగుతున్న యూరిక్ యాసిడ్‌ను కూడా నియంత్రించవచ్చట. నిమ్మరసంలో తేనె కలిపి గోరువెచ్చని నీటితో తాగితే యూరిక్ యాసిడ్ తగ్గుతుందట. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులను సులభంగా తగ్గుతాయట.













Click it and Unblock the Notifications