కడుపు ఉబ్బరంగా ఉంటే సోడా తాగొచ్చా? లేదా?
మనలో చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతుంటారు. ఏదైనా కొంచెం తింటేనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. శారీరకంగా శ్రమ లేకపోవడంతోపాటు ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం, పొగ తాగడం, మద్యపానంతోపాటు అనేకరకాల అలవాట్లు కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి. ఒక్కోసారి ఏమీ తినకపోయినా ఉబ్బరంగా అనిపిస్తుంది. గ్యాస్ వల్ల కావొచ్చు.. లేదంటే కొవ్వు పేరుకుపోవడంవల్ల కూడా అలాగే అనిపిస్తుంటుంది. వీటికితోడు వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది.

విపరీతమైన మానసిక ఒత్తిడి కూడా కడుపు ఉబ్బరానికి కారణం కావచ్చు. సామాజిక, మానసిక, అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వృత్తిపరమైన సమస్యలు, కూడా ఉబ్బరానికి దారితీస్తాయి. దీని వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి జీర్ణక్రియపై ప్రభావం చూపడంతోపాటు కడుపులోలో గ్యాస్ అధిక బరువు, ఊబకాయానికి దారితీస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కాకుండా ఉండటంతోపాటు తీవ్ర ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, అతిగా తినడం కూడా అజీర్తికి కారణమవుతాయి. అలాగే కొవ్వు, మసాలాలు ఉండే ఆహారాన్ని దూరం పెట్టాలి. కాఫీలో ఉండే కెఫీన్ కూడా ఉబ్బరానికి దారితీస్తుంది. అధిక బరువున్నవారు ముందు బరువు తగ్గించుకోవడంపై దృష్టిపెట్టాలి.

కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు చాలామంది సోడా తాగొచ్చా? అని అడుతుంటారు. కొందరికి గ్యాస్ త్రేన్పులద్వారా బయటకు వస్తుంది. ప్రెజర్ తక్కువగా ఉన్నప్పుడు రాదు. అటువంటి సమయంలో మాత్రం సోడా తాగవచ్చు. అప్పుడు ఒత్తిడి పెరిగి త్రేన్పులద్వారా గ్యాస్ బయటకు వస్తుంది. ప్రతిరోజు అదేపనిగా కొందరు సోడా తాగుతుంటారు. అది చాలా హానికరం. సోడాలో ఉండే కార్బన్ డైయాక్సైడ్ వల్ల అనారోగ్యం కలుగుతుంది. అప్పటికప్పుడు కడుపుబ్బరం తగ్గినట్లనిపించినా తర్వాత అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కడుపులో గ్యాస్ ను బయటకు పంపేందుకు సోడా తాగడకుండా ఉండటమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిద్వారానే కడుపు ఉబ్బరం రాకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications