Health Tips: నోటి పూత వేధిస్తుందా.. అయితే ఈ పని చేయండి చాలు..!
నోటి అల్సర్ కు పలు చిట్కాలు పాటిస్తే తెలిగ్గా ఉపశమనం లభిస్తుంది.
విటమిన్ లోపం వల్ల చాలా మందికి నోటి పూత వస్తుంది. నోటి పూత అంటే నోటి అల్సర్. ఇది వస్తే నాలుక లేదా పేదలు, లేదా దవడలకు చిన్న చిన్న పొక్కులు మారిగి పుండ్లు ఏర్పడతాయి. నోటి పూత వల్ల సరిగా మాట్లాడలేం, సరిగా ఆహారం తీసుకోలేం. కారం ఉన్న పదార్థలు తింటే మంట పుడుతుంది. ఈ నోటి పూత0 నిమ్మ, నారింజ, యాపిల్, టొమాటో, స్ట్రాబెర్రీ లాంటి నిమ్మజాతి, ఆమ్ల గుణాలు కలిగిన పండ్లు, కూరగాయలు మోతాదుకు మించి తినడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

హార్మోన్ల అసమతుల్యత
హార్మోన్ల అసమతుల్యత, జింక్, ఫోలికామ్లం, బి12, సి విటమిన్లు, ఐరన్ మొదలైనవి లోపించడం వల్ల కూడా నోటి పూత వస్తుంది. అప్పుడప్పుడు మన తినేనటప్పుడు కోరుక్కుంటే కూడా నోటి పూత వస్తుంది. ఈ నోటి పూతకు తేనె చక్కని ఉపశమనంగా పని చేస్తుంది. తేనెలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాల వల్ల నోటిపూత నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. తేనెలో కాస్త పసుపు వేసుకుని దాన్ని నోటి పూత ఉన్న భాగంలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నోటి పూత తగ్గుతుంది.

లవంగం
నోటి పూత వచ్చిన వారు లవంగం నమలడం, యాలకులు నవలడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇలా లంగం, యాలకులు రెండు మూడు రోజులు నవిలితే నోటి పూత సమస్య తగ్గిపోతుంది. కొబ్బరినీళ్లు, ఎండు లేదా పచ్చి కొబ్బరి, కొబ్బరి నూనె.. వీటితో కూడా నోటిపూత తగ్గే అవకాశం ఉంది. కొబ్బరి నూనెను సమస్య ఉన్న చోట రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

తులసి ఆకులు
తులసి ఆకుల్లో చాలా ఔషధ గుణాలున్నాయి. వీటి వల్ల ఒత్తిడి దూరమవుతుంది. నోటిలో కొన్ని నీళ్లు పోసుకుని తర్వాత కొన్ని తులసి ఆకుల్ని వేసుకుని.. నీటితో పాటే నమలాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేయాలి. దీనివల్ల నోటిపూత త్వరగా తగ్గే అవకాశం ఉంది. ల పదార్థాలతో కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చట. నోటి పూత ఉన్న చోట నెయ్యి రాయడం సమస్య నుంచి బయటపడవచ్చు.

నీళ్లు
నోటిపూత వచ్చిన వారు ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. వారు శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవాలి. ఎక్కువగా వేడి చేసే వస్తువులు తినకూడదు. కొంతమందికి ఒత్తిడి వల్ల కూడా నోటి పూత వస్తుంది. అటువంటివారు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇక నోటిపూత వచ్చినవారు అది త్వరగా తగ్గడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications