ఎలుకల బెడదను తగ్గించే మొక్కలు.. ఇవి ఇంట్లో పెంచుకుంటే?
ఎలుకలు మన నివాసాలలో , పంటలలో కీటకాలు, వ్యాధులను వ్యాప్తిచేస్తాయి. దీని వల్ల మన ఆరోగ్యాన్ని, ఆస్తికి హాని కలిగిస్తాయి. ఎలుకలను నివారించడానికి మార్కెట్లో సులభంగా దొరికే రసాయనాలను ఉపయోగించడం సాధారణమైనదే. కానీ అవి ఆరోగ్యానికీ, పర్యావరణానికీ హానికరం. అందుకే సహజ పద్ధతులు, ముఖ్యంగా కొన్ని వాసనలతో ఎలుకలను ఆకర్షించకుండా, తరిమి కొట్టే మొక్కలను ఉపయోగించడం ఉత్తమమైన పద్ధతి.
1. పుదీనా
పుదీనా వాసన ఎలుకలకు అసహ్యంగా ఉంటుంది. పుదీనాలో ఉండే వాసన ఎలుకలను తట్టుకోలేరు. ఈ మొక్కలను ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచడం లేదా పుదీనా ఆకులను ఎక్కడ ఎలుకలు ఎక్కువగా కనిపిస్తాయో ఆ ప్రదేశంలో ఉంచడం ద్వారా ఎలుకలను తరిమి పెట్టవచ్చు. అలాగే, పుదీనా నూనెను కూడా నీటిలో కలిపి స్ప్రే చేయడం ద్వారా వాసనను కొనసాగించవచ్చు.

2. లావెండర్
లావెండర్‌కున్న సువాసన ఎలుకలకు అస్సలు నచ్చదు. ఇంట్లో లావెండర్ మొక్కలను పెంచితే ఎలుకల సమస్య నుంచి బయటపడవచ్చు. రోజ్‌మేరీ వాసన ఎలుకలకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇంట్లో రోజ్‌మేరీని నాటితే ఎలుకలు ఉండవు. నిమ్మగడ్డి వాసన తాజాగా ఉంటుంది. ఈ వాసన అంటే ఎలుకలకు అస్సలు నచ్చదు. నిమ్మగడ్డి మొక్కలను ఇంట్లో ఉంచితే ఎలుకల బెడద తప్పుతుంది.
3. కృష్ణతులసి
కృష్ణతులసి, మన సంస్కృతిలో పవిత్రమైన మొక్కగా ప్రాముఖ్యత పొందినది. ఇది శక్తివంతమైన వాసన కలిగినందువల్ల ఎలుకలకు నచ్చదు. ఇంటి ముందర లేదా తోటలో కృష్ణతులసి మొక్కలను పెంచడం ద్వారా ఎలుకలను నివారించవచ్చు. ఈ మొక్కల నుంచి వచ్చే సహజ వాసన ఎలుకలను తరిమే శక్తిని కలిగి ఉంటుంది.
4. నీలగిరి
నీలగిరి మొక్క వాసన కూడా ఎలుకలకు ఇష్టపడే వాసనం కాదు. నీలగిరి నూనెను నీటిలో కలిపి ఎలుకలు ఉండే ప్రాంతంలో పిచికారీ చేయడం, లేదా నీలగిరి ఆకులను ఉంచడం ద్వారా ఎలుకలను నివారించవచ్చు. దీనిలో ఉండే వాసన అనేక జంతువులను దూరంగా ఉంచుతుంది.
5. అల్లం , వెల్లుల్లి
ఎలుకలను తరిమే సహజ గుణాలు అల్లం మరియు వెల్లుల్లిలో ఉన్నాయి. ఇంటి చుట్టుపక్కల ఈ మొక్కలను పెంచడం లేదా అల్లం, వెల్లుల్లి కలిపిన మిశ్రమాన్ని ఎలుకలు వచ్చే ప్రదేశాల్లో ఉంచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. వీటిలో ఉండే గంధం ఎలుకలను తప్పించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.
6. నిమ్మకాయ విత్తనాలు
నిమ్మకాయ వాసన కూడా ఎలుకలను నివారించడంలో సహాయపడుతుంది. నిమ్మకాయ వాసనకు ఎలుకలు దూరంగా ఉంటాయి. నిమ్మకాయ మొక్కలను ఇంటి దగ్గర పెంచడం లేదా నిమ్మకాయ నూనెను నీటిలో కలిపి ఆ ప్రదేశంలో స్ప్రే చేయడం వల్ల ఎలుకలను నివారించవచ్చు.
7. బంతిపువ్వు
బంతిపువ్వు మొక్కలను పంటల మధ్య పెంచడం ద్వారా కీటకాలతో పాటు ఎలుకలను కూడా నివారించవచ్చు. ఈ పువ్వుల నుంచి వచ్చే వాసన ఎలుకలకు అసహ్యంగా ఉంటుంది, అందువల్ల తోటలో బంతి పువ్వులను పెంచడం మంచి పరిష్కారంగా ఉంటుంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications