జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే ఇలా చేయండి!
శీతాకాలం వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చర్మానికి సంబంధించిన సమస్యలే కాకుండా జుట్టు సమస్యలు కూడా వస్తుంటాయి. గాలిలో తేమ పెరగడంవల్ల జుట్టు పొడిబారడమే కాకుండా చిట్లి పోతుంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడంవల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాటిగురించి తెలుసుకుందాం.
హెయిర్ మాస్క్ మంచిది. మందారపువ్వు, వేప, ఉసిరి వంటి ఆయుర్వేద మూలికలతో వీటిని తయారు చేసుకోవాలి. దీన్ని తలకు పట్టిస్తే జుట్టుకు బలం. కొబ్బరినూనెలో పొడి మూలికలను కలిపి హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. రాసుకునే నూనెను కూడా బాగా వేడిచేసి దాంతో మర్దనా చేసుకోవడం మంచిది. జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణ జరిగి జుట్టు ఊడిపోకుండా, చిట్లిపోకుండా చూస్తుంది. ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది.

శీతాకాలం శరీరం, జుట్టు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. కచ్చితంగా రోజుమొత్తం మంచినీరు ఎక్కువగా తీసుకుంటుండాలి. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. జుట్టు కుదుళ్లు పొడిబారకుండా ఉండాలంటే తగినంత నీరు తాగడం ఎంతో ప్రధానం. నీరు ఎక్కువగా తీసుకోవడంవల్ల శరీరం హైడ్రేట్ అయి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల జుట్టు డ్రై అవకుండా ఉండటంతోపాటు శరీరం కూడా పగలదు.
మంచి ఆహారాన్ని తీసుకుంటుండాలి. మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల జుట్టుకు మంచి పోషణ అందుతుంది. ఆహారంలో ఆకు కూరలు, పండ్లు, కూరగాయలు, గింజలు ఉండాలి. వీటిని క్రమంలో తప్పకుండ తీసుకోవడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యవంతంగా తయారవుతుంది. దీనివల్ల ఎటువంటి వ్యాధులు శరీరం దరిదాపుల్లోకి కూడా రావు.












Click it and Unblock the Notifications