Fasting: ఉపవాసం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

చాలా మంది దేవుడిపై భక్తితో ఉపవాసం ఉంటారు. మరి కొంత మంది బరువు తగ్గడానికి ఉపవాసం ఉంటారు. ఉపవాసం అనేది మనకేం కొత్త కాదు. ఎందుకంటే ఉపవాసం అనేది పురాతనకాలం నుంచి అనుసరిస్తున్న విధానం ముఖ్యంగా పండుగలు, పర్వదినాలకి ఉపవాసాలు ఉండడం సాంప్రదాయం. కొందరు పండుగలకు, పర్వదినాలకి మాత్రమే ఉంటే.. మరికొందరు వారానికి ఒక రోజైనా చేస్తుంటారు. మరి ఉపవాసం చేస్తే మంచిదేనా..

కాలేయం, మూత్రపిండాలు

కాలేయం, మూత్రపిండాలు

శరీరంలో కాలేయం, మూత్రపిండాలు రెండూ మన శరీరం నుంచి విషవ్యర్థాలను నిరంతరం తొలగిస్తాయి. కానీ పోషకాలతో కూడిన మంచి ఆహారాన్ని ప్రణాళికా బద్దంగా తీసుకోవడం తప్పనిసరి. నిరంతరం పనిచేసే జీర్ణ వ్యవస్థకు కొంత ఊరటగా ఈ ఉపవాసం ఉంటుందని కూడా కొందరు చెబుతున్నారు.

నీరు

నీరు


అయితే ఉపవాసం ఉన్న తప్పుకుండా నీరు తాగాలి. లేకుంటే గ్యాస్ ఫామ్ అయి భవిష్యత్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే ఉపవాసం ఉన్న వారు నీరు లేక పండ్లను తీసుకుంటే మంచిదని వివరిస్తున్నారు.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపవాసం సాయపడుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవు. అంతేకాకుండా, ఉపవాసం గురించి సరైన అవగాహన లేకుండా సుదీర్ఘకాలం ఉపవాసం చేస్తే, అది మీకు ప్రమాదకరంగా మారొచ్చు.

ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌

ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌

ఈ మధ్య ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ అని కొత్తగా వచ్చింది. కొన్ని గంటలపాటు ఏమీ తినకుండా.. ఇంకొన్ని గంటల్లో మాత్రం పోషకాహారం తీసుకునే పాక్షిక ఉపవాస విధానం ఇది. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ను మూడు రకాలుగా
విభజించవచ్చు. ఒకటి.. 12 గంటల ఫాస్టింగ్‌. రాత్రి భోజనానికి, ఉదయం అల్పాహారానికి మధ్య 12 గంటలు వ్యవధి ఉండాలి. మధ్యలో నీళ్లు మినహా చాయ్‌ కూడా తాగకూడదు. అలాగే 14 గంటలు, 16 గంటల ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ విధానాలూ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+