ఫెర్టిలిటీ రీసెర్చ్‌: మొటిమల మందు పురుషుల సంతానోత్పత్తిని పెంచుతుందా?

మీరు ముఖంపై మొటిమలను వదిలించుకోవడానికి తీసుకునే మందు పురుషుల సంతానోత్పత్తిని కూడా పెంచుతుందని మీకు తెలుసా? ఇది ఒక అద్భుతంలా అనిపించవచ్చు, కానీ సైన్స్ ఓ కొత్త ఆశను రేకెత్తించింది. అధికంగా ఉన్న మొటిమల కోసం ఉపయోగించే ఔషధం ఐసోట్రెటినోయిన్ పురుషుల సంతానోత్పత్తిని పెంచవచ్చని ఓ కొత్త అధ్యయనంలో కనుగొనబడింది. రీసెర్చ్ ప్రకారం.. 37 శాతం మంది పురుషులలో శుక్రకణాల ఉత్పత్తిలో మెరుగుదల కనిపించింది. విటమిన్-ఎ ఆధారిత ఈ ఔషధం శుక్రకణాల అభివృద్ధిని తిరిగి యాక్టివ్ చేయగలదని సైంటిస్టులు భావిస్తున్నారు.

షాకింగ్ ఫలితాలు: 37శాతం పురుషుల్లో మెరుగుదల
పరిశోధకులు ఒకే కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించారు. దీనిలో 30 మంది పురుషులను పరిశీలించారు. ఈ పురుషులలో నాన్ఆబ్‌స్ట్రక్టివ్ అజూస్పెర్మియా (వృషణాలు శుక్రకణాలను ఉత్పత్తి చేయలేని పరిస్థితి) లేదా క్రిప్టోజూస్పెర్మియా (శుక్రకణాల సంఖ్య చాలా తక్కువగా, అస్థిరంగా ఉండే పరిస్థితి) ఉన్నట్లు నిర్ధారణ అయింది. పాల్గొనేవారికి మూడు నుంచి తొమ్మిది నెలల వరకు రోజుకు రెండుసార్లు 20 మిల్లీగ్రాముల ఐసోట్రెటినోయిన్ మోతాదు ఇవ్వబడింది. వారికి క్రమం తప్పకుండా మెటబాలిక్, వీర్యం విశ్లేషణ జరిగింది.

Isotretinoin Acne Drug May Boost Male Fertility

మొటిమల మందుతో సంతానోత్పత్తిలో అనూహ్య పెరుగుదల
30 మంది పురుషులలో 11 మంది (37%) చికిత్స తర్వాత నమ్మదగిన, చలనం ఉన్న శుక్రకణాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఇప్పటికే అజూస్పెర్మియాతో బాధపడుతున్న పురుషులలో, శుక్రకణాలు ఏర్పడే ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయిన వారిలో అత్యధిక ప్రతిస్పందన రేటు 54 శాతం కనిపించింది. దీని అర్థం రెటినోయిక్ యాసిడ్ (విటమిన్-ఎ క్రియాశీల రూపం) లోపం ఒక అడ్డంకిగా ఉన్న శుక్రకణాల అభివృద్ధి చివరి దశను పునరుద్ధరించడంలో ఈ మందు కీలక పాత్ర పోషించగలదు.

ఈ మందు ఎలా పనిచేస్తుంది?
కొన్ని రకాల వంధ్యత్వంలో శుక్రకణాల సరైన పెరుగుదలకు అవసరమైన రెటినోయిక్ యాసిడ్ లోపం ఉంటుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఐసోట్రెటినోయిన్ ఈ యాసిడ్ రూపమే కాబట్టి ఆ లోపాన్ని పూరిస్తుంది. ఈ ఔషధం వృషణాల వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా శుక్రకణోత్పత్తి ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది.

పెద్ద క్లినికల్ ట్రయల్స్‌కు పరిశోధకుల పిలుపు
ఈ ప్రారంభ ఫలితాలను ధృవీకరించడానికి పెద్ద అధ్యయనాలు అవసరమని పరిశోధకులు సూచించారు. అయినప్పటికీ ఈ గణాంకాలు గతంలో వంధ్యులుగా భావించబడిన పురుషులకు ఆశాజనకమైన, నాన్-ఇన్వాసివ్ చికిత్సా మార్గాన్ని చూపుతున్నాయి. ఇది ధ్రువీకరించబడితే తీవ్రమైన వృషణ వైఫల్యం ఉన్న పురుషులలో సహజ శుక్రకణాల ఉత్పత్తిని ప్రేరేపించగల మొట్టమొదటి నోటి ద్వారా తీసుకునే చికిత్స ఐసోట్రెటినోయిన్ కావచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+