బెల్లం టీ తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా?
ఏం తినకపోయినా బరువు పెరుగుతున్నామని కొందరు బాధపడుతుంటారు. తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ప్రయత్నించేవారికి బెల్లం టీ సరైన ఔషధమని నిపుణులు తెలియజేస్తున్నారు. బెల్లంలో పోషకాలు మెండు. కాల్షియం, పొటాసియం, మెగ్నీషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి2 లాంటివి ఉంటాయి.
బెల్లం టీ తీసుకోవడంవల్ల ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. ఇలా అవడంవల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోదు. పొట్టచుట్టూ కొవ్వు రాకుండా ఇది సహాయపడుతుంది. బెల్లంలోని చక్కెర కంటెంట్ జీవక్రియ రేటును పెంచుతుంది. ఐరన్ లోపం ఉంటే రక్తహీనత తలెత్తుంది. బరువు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. బెల్లం రక్తహీనతను తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. పొటాషియం మెండుగా ఉండే బెల్లం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. కండరాలను నిర్మించడానికి, జీవక్రియను పెంచడానికి పొటాషియం తోడ్పడుతుంది. అధిక బరువును ఇది కరిగిస్తుంది.

బెల్లంటీని ఎలా చేసుకోవాలంటే:
నీళ్లు - 2 కప్పులు
బెల్లం - 3 టేబుల్ స్పూన్లు
టీపొడి - 1 టీస్పూన్
అల్లం - 1 అంగుళం
యాలకులు - 3
దాల్చినచెక్క - చిన్నముక్క
నల్ల మిరియాల పొడి - చిటికెడు
స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్లు పోసి అల్లం, యాలకులు, తులసి ఆకులు, దాల్చిన చెక్క నీళ్లల్లో వేయండి. దీన్ని 5 నిముషాలు మరగబెట్టాలి. తర్వాత మిరియాల పొడిని కలపాలి. టీపొడి, బెల్లం మిక్స్ చేయండి.. దీన్ని బాగా మరగనిచ్చి ఆరిపోయిన తర్వాత తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.












Click it and Unblock the Notifications