బెల్లం టీ తాగితే ఏమవుతుందో తెలుసా?
సాధారణంగా ఎక్కువమంది ప్రజలకు కాఫీ, టీ అలవాటు ఉంటుంది. చలికాలంలో పొద్దున్నే ఒక చుక్క వేడి వేడి టీ తాగాలని అందరూ అనుకుంటారు. వాస్తవానికి శీతాకాలంలో రోగాలు వేగంగా వ్యాప్తిచెందుతాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. బ్యాక్టీరియా కూడా ఎటాక్ చేస్తుంది. అందుకే చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే భోజనం చేయాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సూర్యుడి నుంచి వచ్చే వేడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే భోజనాన్ని త్వరగా చేయాలని సూచిస్తున్నారు.
ఎక్కువ మంది వ్యాయామాలు చేయడానికి ఆసక్తి చూపరు. దీనివల్ల ఫిట్ నెస్ కోల్పోతారు. ఇలాంటి సమయంలో బెల్లంటీ తాగితే బరువు తగ్గడమే కాకుండా కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు. బెల్లంటీని ఎలా తాగాలో? దానివల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకుందాం. శీతాకాలంలో క్రమం తప్పకుండా బెల్లంటీ తాగుతుండటంవల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి కాబట్టి జీర్ణక్రియ పెరుగుతుంది. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

చలికాలంలో చాలామంది సులువుగా బరువు పెరుుగుతుంటారు. బరువు తగ్గాలనుకునేవారు ఆహారాన్ని మార్చి తీసుకోవాలి. కొవ్వును కరిగించడంలో బెల్లం టీ బాగా పనిచేస్తుంది. శీతాకాలంలో బెల్లంతో చేసిన ఆహారాలు తీసుకోవడంవల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అదే శరీరానికి బలంగా మారుతుంది. మహిళలు కూడా బెల్లంటీని తాగాలి. ఇందులో అనేకరకాల పోషకాలు లభిస్తాయి. మహిళల్లో వచ్చే నెలసరి నొప్పులు కూడా బెల్లంటీతో తగ్గించుకోవచ్చు. పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గించడంలో బెల్లంటీ చాలాబాగా పనిచేస్తుంది.












Click it and Unblock the Notifications