షుగరు పేషెంట్లకు దివ్య ఔషధం..!
కందను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. మధుమేహ బాధితులకు ఇది సూపర్ ఫుడ్ లా పనిచేస్తుందని చెబుతున్నారు. కందలోని ఫ్లేవనాయిడ్ సమ్మేళనం కూడా యాంటీ-ఒబెసిటీ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఊబకాయాన్ని, అదనపు ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. ఈ దుంపలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే వెంటనే పొట్ట నిండిపోయిన అనుభూతి కలిగి మితాహారాన్ని తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునేవారు కందను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.
డయాబెటిస్ నియంత్రణ : కందలో అల్లాంటోయిన్ అనే రసాయన సమ్మేళనం సహజంగా ఉంటుంది. ఇది యాంటీ డయాబెటిక్‌గా పనిచేయడంతోపాటు మధుమేహ రోగుల్లో లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది. షుగరు లెవల్స్ ను నియంత్రించడంతోపాటు ఫైబర్ కంటెంట్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా షుగరు వ్యాధిగ్రస్తులకు కంద సూపర్‌ఫుడ్ లాంటిది.

పెద్దపెగు క్యాన్సర్ రిస్క్ తక్కువ : కందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్(వాపు) ప్రక్రియను తగ్గిస్తాయి. దీనివల్ల పెద్దపేగు కాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది.
క్యాన్సర్ నివారణ : కందలోని అల్లాంటోయిన్ సమ్మేళనం క్యాన్సర్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఎల్-అర్జినైన్ సమ్మేళనం రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ నివారణలో కీలకంగా వ్యవహరిస్తుంది.
రక్తహీనత నివారణ : శరీరంలో ఐరన్, ఫోలేట్ లేకపోతే రక్తహీనతకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కంద దుంపలను ఆహారంగా తీసుకోవాలి.
మోనోపాజ్ నుంచి ఉపశమనం : మహిళల్లో మెనోపాజ్ సమయంలో స్త్రీలల్లో నిద్రలేమి, చికాకు, కడుపులో నొప్పి, వికారం వంటి లక్షణాలు ఉంటాయి. కంద దుంపతో చేసిన వంటకాలు తింటే వాటి లక్షణాల నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది.
చిరాకు, ఆందోళన తగ్గింపు : కందలో విటమిన్ బీ6 పోషకం ఉంటుంది. విటమిన్ బీ6 సప్లిమెంట్‌గా పనిచేసే ఈ ఫుడ్ ఐటమ్స్ చిరాకు, ఆందోళన వంటి వాటిని తగ్గిస్తాయి.












Click it and Unblock the Notifications