దోమల బెడదను నివారించే వంటింటి చిట్కాలు.. ఇలా చేస్తే పరార్..!
దోమలు అనేవి ప్రతి ఇంట్లోనూ సాధారణ సమస్య. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరమైన జబ్బులను వ్యాప్తి చేస్తాయి. అందుకే వీటిని నివారించడం చాలా ముఖ్యం. ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా సహజసిద్ధమైన పద్ధతులతో దొమలను నశింపజేయవచ్చు. వంటింట్లో అందుబాటులో ఉండే కొన్ని చిట్కాలతో దోమల సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.
1. లవంగాలు
లవంగాలు - నిమ్మరసాన్ని మిక్స్ చేసి దోమలు ఉండే ప్రదేశాల్లో ఉంచండి. దీని వాసన దోమలను తట్టుకోలేకపోతుంది. లవంగపు గింజలను నీటిలో ఉడికించి ఆ నీటిని ఇంట్లో అటూ ఇటూ చల్లుకోవచ్చు. లవంగపు నూనెను దీపం వెలిగించేటప్పుడు కొన్ని చుక్కలు వేయవచ్చు. ఇలా చేయడం వల్ల దోమల బెడద తగ్గుతుంది.

2. నిమ్మరసం, నిమ్మకాయ తొక్కల ఉపయోగం
దోమలను ఆకర్షించకుండా చేయడానికి నిమ్మరసాన్ని నీటిలో కలిపి ఇళ్ల మూలల్లో చల్లి చూడండి. నిమ్మకాయ తొక్కలను దొమలు ఎక్కువగా చేరే ప్రదేశాల్లో ఉంచితే అవి దూరంగా ఉంటాయి.
3. వెల్లుల్లి నీరు
వెల్లుల్లి రెబ్బలను కోసి గదిలో ఉంచడం ద్వారా దోమలను దూరం చేయవచ్చు. వెల్లుల్లిని నీటిలో మరిగించి ఆ నీటిని గదుల్లో స్ప్రే చేయండి. వెల్లుల్లి వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. కర్పూరాన్ని చిన్న పాత్రలో వెలిగించి గదిలో ఉంచితే దొమలు మరణిస్తాయి.
4. తులసి
తులసి ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని స్ప్రే చేయవచ్చు. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ద్వారా దోమలను నివారించవచ్చు. తులసి మొక్కను ఇంటి ముందు పెంచడం వల్ల కూడా దొమలు ఇంట్లోకి రావు. తులసి ఆకుల రసం దోమలను ఆకర్షించకుండా చేస్తుంది.
5. లెమన్ గ్రాస్
లెమన్ గ్రాస్ నూనెను దీపం వెలిగించేటప్పుడు కొన్ని చుక్కలు వేయవచ్చు. లెమన్ గ్రాస్ ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని స్ప్రే చేయవచ్చు. వేప నూనెను నీటిలో కలిపి గదుల్లో స్ప్రే చేస్తే దోమలు దూరంగా ఉంటాయి.
6. కాఫీ పొడి
వంటింట్లో ఉన్న కాఫీ పొడి దోమలను మటుమాయం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీటి నిల్వ ప్రాంతాల్లో కాఫీ పొడిని చల్లితే దోమ గుడ్లు పగిలిపోతాయి. అదే విధంగా నిమ్మపొడి లేదా వేప పొడిని దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చల్లితే అవి దూరంగా ఉంటాయి.
7. నీలగిరి నూనె
నీలగిరి నూనెను కొబ్బరి నూనెతో కలిపి చర్మంపై రాసుకుంటే దోమలు దూరంగా ఉంటాయి. ఈ నూనెను నీటిలో కలిపి స్ప్రే చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి. పుదీనా ఆకులను మరిగించి, ఆ నీటిని గదుల్లో స్ప్రే చేస్తే దోమలు ఇంట్లో ఉండవు.
నివారణకు చిట్కాలు:
నీరు నిల్వ ఉండే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచండి. ఇంట్లో వాతావరణాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం ద్వారా దోమల సమస్య తగ్గుతుంది. కిటికీలకు దోమల చంద్దులు (mosquito nets) అమర్చడం మేలు. ఈ సహజ పద్ధతులను పాటించడం ద్వారా దోమలను దూరంగా ఉంచుకోవచ్చు . కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
-
అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే, సమస్యలన్నీ పరార్..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications