కొంబుచా టీ (తియ్యటి ఆల్కహాల్) తాగారా? గుండె పదిలం
కొంబుచా టీని రెండువేల సంవత్సరాల క్రితం కనుగొన్నారు. మొదట చైనాలో తయారై తర్వాత జపాన్, రష్యాతోపాటు ఇతర దేశాలకు వ్యాపించింది. ఈస్ట్, బ్యాక్టీరియా, చక్కెర నుంచి తయారుచేస్తారు. ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
చక్కెర, ఈస్ట్, బ్లాక్ టీ కలిపిన మిశ్రమాన్ని కొన్నివారాలపాటు పులియబెడతారు. దీనినే కణ్వ ప్రక్రియ అని కూడా అంటారు. ఇందులో కొన్ని రకాల ఈస్ట్ బ్యాక్టీరియా ఆమ్లాలను విడుదల చేసి పై పొరను ఏర్పరుస్తాయి. దీన్ని పక్కన ఉంచి లోపలి పానీయాన్ని తాగుతారు. ఈ పొరను కొంబుచా అంటారు. తియ్యటి ఆల్కహాల్ రుచిని కలిగివుంటుంది.

రెండు కప్పుల నీళ్లల్లో ఒకటిన్నర కప్పుల పంచదార వేసి స్టవ్ మీద ఉంచాలి. పంచదార బాగా కరిగిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల బ్లాక్ టీ వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక కప్పు వెనిగర్ వేయాలి. తయారుచేసిన కొంబుచాను ఒక పొరలో వేసి 15 నుంచి 20 రోజులపాటు చల్లని పొడి ప్రదేశంలో ఉంచాలి. ఎంత ఎక్కువసేపు నిల్వ ఉంటే అంత తియ్యగా, రుచిగా ఉంటుంది. దీన్ని రోజూ తీసుకోవచ్చు.
జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కడుపు, పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు నాశనమవుతాయి. దీన్ని రోజూ తాగడంవల్ల గుండె జబ్బులు తగ్గుతాయని తేలింది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.రక్తపోటును నియంత్రిస్తుంది. కొంబుచా టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. టైప్ 2 షుగరు రోగులకు మంచి ఔషధం. అలాగే ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలున్నాయి.












Click it and Unblock the Notifications