సమ్మర్ స్పెషల్ లస్సీ.. ఇలా చేస్తే చిటికెలో రెడీ..!
ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దాంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎండల కారణంగా చాలామంది ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేశారు. ఫ్రైలు, నాన్ వెజ్ ఐటెమ్స్ ను పక్కనపెట్టేస్తున్నారు. సూప్ లు, జ్యూస్ లు తయారు చేసుకుని వాటిని లాగించేస్తున్నారు. అయితే లస్సీ అనగానే అందరికీ నోరూరుతుంది. లస్సీ ఎక్కువగా బయటే దొరుకుతుంది. కానీ లస్సీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. రోడ్ సైడ్ ఉన్న టేస్ట్ కు ఏమాత్రం తగ్గకుండా లస్సీ టేస్టు ఉంటుంది. మరి తక్కువ పదార్థాలతో సూపర్ టేస్టీగా ఉండే లస్సీని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇక్కడ చూద్దాం..
లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పెరుగు ఒక కప్పు, చల్లటి నీరు లేదా పాలు అర కప్పు, చక్కెర రెండు టేబుల్ స్పూన్ లు, యాలకుల పొడి చిటికెడు, ఐస్ క్యూబ్స్ ఐదు లేదా ఆరు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు సూపర్ టేస్టీ లస్సీ తయారీ విధానం చూస్తే.. ముందుగా పెరుగును తీసుకుని దాన్ని బ్లెండర్ లో వేసి స్మూత్ గా చేసుకోవాలి. ఆ తర్వాత అందులో చక్కెర, యాలకుల పొడి వేసి బ్లెండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమంలో నీళ్లు లేదా పాలు తగినన్ని పోసి మళ్లీ బ్లెండింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు అదే మిశ్రమంలో ఐదు లేదా ఆరు ఐస్ క్యూబ్స్ వేయాలి. బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని గ్లాసులో పోసి డ్రైఫ్రూట్స్ తో మొత్తం గార్నిష్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ లస్సీ రెడీ అయినట్టే.. ఇప్పుడు చల్లగా లస్సీని సర్వ్ చేసుకోవడమే.. వేసవిలో లస్సీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేకాక చాలా ఆరోగ్యం కూడా.. మీరూ ఓసారి ట్రై చేయండి..












Click it and Unblock the Notifications